Like-o-Meter
[Total: 0 Average: 0]
కావలసిన పదార్ధాలు:
- రెండు టీ స్పూను – బార్లీ
- 2 కప్పుల నీళ్ళు
- రుచి కోసమై నిమ్మకాయ రసము/తేనె /పంచదార
చేసే పద్ధతి
పావు కప్పు అనగా రెండు ఔన్సులు .ముందుగా బార్లీని , కొంచెము చల్ల నీళ్ళలోనే బాగా
కలిపి ఉంచుకోవాలి.
ఆ తర్వాత, బాగా తెర్లే నీళ్ళలో ఆ బార్లీ పిండి గుజ్జును బాగా కలపాలి.(మరిగే నీళ్ళలోకలిసి పోయేలా,గరిటతో కలియ త్రిప్పుతూ ). ఇలాగ చేయక పోతే, పిండి ఉండలు కడుతుంది.
తేనెను కానీ, చక్కెరను గానీ, జాగరీని గానీ రుచి కోసము వేసుకో వచ్చును.
జపాను, చైనాలలోతేనెను వేసుకునే అలవాటు ఉన్నది. జపనీయులు నిమ్మకాయ చెక్క(slice)ను పిండుకును, ఇష్టంగా తీసుకుంటారు.
మన దేశంలో , కేవలము పథ్యముగా తీసుకునే పానీయముగా భావిస్తూంటారు. కానీ, ఇతర దేశాలలో ఇది ఉదయమున టీ, కాఫీ -లకు ప్రత్యామ్నాయముగా భావిస్తారు. తెల్లవారుజామున వేడి వేడిగా ఈ బార్లీ డ్రింకును వారు సేవిస్తారు.
Barley Teaని Mugicha అని కొన్ని ఇతర ఆసియా దేశాలలో వ్యవహరిస్తూంటారు.