ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వైకుంఠపాళీ – నవలిక

Like-o-Meter
[Total: 1 Average: 4]

జీవితానికి నిర్వచనాలు అనేకాలు. కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే “వైకుంఠపాళీ” ఆట.

ఎవరు ఎప్పుడు ఎలా కనిపెట్టారో తెలియని ఈ ప్రాచీనమైన ఆట హైందవసంస్కృతిలో కలగలసిపోయింది. చిన్నతనంలోనే జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను పట్టుదలతో దాటగలిగే మనోనిబ్బరాన్ని కలిగించగలిగే ఒక అపురూపమైన ఆట ‘వైకుంఠపాళీ’.

జీవితానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య వారధిలా నిలిచిన ఈ ఆటను ఇతివృత్తంగా తీసుకుని, లక్ష్మీనారాయణుల్ని ఆటగాళ్ళుగానూ, రెండు జంటలు పావులుగానూ కూర్చి, వైకుంఠపాళిలో దాగివున్న ఆధ్యాత్మిక, మనోవైజ్ఞానిక విశేషాల్ని వివరిస్తూ సాగే “వైకుంఠపాళీ” నవలిక రేపటి ఉగాది నుండీ ప్రతి శుక్రవారం ఆవకాయ.కామ్ పాఠకులకు అందించబోతున్నాం.

ఆసక్తితోబాటూ ఉపయుక్తమైన రచనల్ని అందించడంలో భాగంగా  మా ఈ చిరుప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…

ధన్యవాదాలతో…
ఆవకాయ.కామ్ బృందం