ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆ ఇద్దరి పేర్లూ & ప్రేమ కట్టడం పై కవిత

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆ ఇద్దరి పేర్లూ …..

ఎంత నిజం ఎంత అబద్దమో తెలీదు కాని భారతంలో ద్రౌపది అర్జునుణ్ణి మనసారా ప్రేమించేదని, కాని మనసులోనే ద్రౌపదిని ఆరాధించినది భీముడే అని అంటారు.

డ్రీం గాళ్ హేమమాలిని నిజంగా గొప్ప అందగత్తె, మంచి అభినేత్రి అనడంలో సందేహం లేదు. హేమా మేడం పెళ్ళాడినది జనాబ్ ధరం సాబ్ నే అయినా ఆ రోజుల్లో మానసచోరుడు మాత్రం జితేంద్ర గారట!

హేమామాలిని రామానుజం చక్రవర్తి 16-10-1948 లొ పుట్టింది.1968 లో సప్నోం కా సౌదాగర్ సినిమా తో బాలివుడ్ ప్రయాణం మొదలుపెట్టింది. అకడమిక్‍గా  పదవ తరగతి దాటని హేమా సాహెబా ప్రతిభను గుర్తించి పదంపద్ సింఘానియా యూనివర్సిటీ డాక్టరేట్ నిచ్చింది. అలాగే ప్రభుత్వం పద్మశ్రీని ప్రదానం చేసింది.

బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియొల్. 08-12-1935 న పంజాబ్ లో పుట్టాడు. తండ్రి స్కూల్ మాష్టార్. 1954 లో పర్కాష్ కౌర్ ని పెళ్ళి చేసుకున్నారు. మంచి కవితా ప్రియుడు. హాస్యప్రియుడు కూడా. కొంతకాలం మీనాకుమారికి సన్నిహితుడనే రూమర్ కూడా వుంది. 

షోలే సినిమా సమయంలో తమిళ హేమాజి పంజాబ్ సర్దార్ ధరం పాజీల మద్య ప్రేమవనం వికసించింది. పరకాష్ కౌర్ విడాకులకు నిరాకరించడంతో ధరం పాజి హేమా అమ్మణ్ణి ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. మతం మారిన ధరం, హేమాలు 1980 లో నిఖా అడారు. 1980 తర్వాత వారి ఇద్దరి పేర్లు ఏమిటొ నాకూ గుర్తు లేదు.


 

ఒక మంచి అనుభవం: ప్రేమ కట్టడం… కవిత

తాజ్ మహల్ పై ఇప్పటీకే చాలా చాలా కవితలు వచ్చాయి. ఎన్ని కవితల్ని ఎందరు రాసినా ప్రతీ కొత్త కవిత అందంగానే వుంటుంది. తాజ్ మహల్ ఒక విషాద సౌందర్యానికి ప్రతీక. ఇటీవల ఆవకాయ లో ప్రచురితమైన రేణుక అయోల కవిత ప్రేమ కట్టడం… తాజ్ పై వచ్చిన మంచి కవితల్లో ఒకటి.

సౌందర్యాన్ని కవి తనదైన అనుభవం లోకి తెచ్చుకున్న సౌందర్యాత్మక అనుభవం ఈ కవితలో కనబడుతుంది.

జారుతున్న మంచు దుప్పటిలో
ఉదయించే సూర్యకిరణాల వెచ్చదనంతో
ధ్యానంలో నిమగ్నమైన యోగిలా
అంతంత మాత్రమే ప్రవహించే యమునానది కన్నుల్లో
ప్రతిబింబంగా మారాలని ప్రయత్నించే ”తాజమహల్” మెట్లమీద
ఈ ఉదయం అపురూపం.

మరీ ముఖ్యంగా కవిత ఎత్తుగడ లోనే ఒక మంచి చిత్రం కనబడుతుంది.

చారిత్రాత్మక అంశాల్ని కవిత్వం చేస్తున్నప్పుడు రెండు విషయాల్ని గమనించాలి. చరిత్ర అస్తిపంజరం అయితే వర్ణన రక్తమాంసాలు. తెలిసో తెలియక రేణుక అయోల ఈ టెక్నిక్ ను చక్కగా వాడుకోన్నారు.

 

2

నాకు నచ్చిన మరో తాజ్ మహల్ కవిత – సాహిర్ ఉర్దూ ఘజల్:

ఎక్ షెహన్ షా నే దౌలత్ క సహార లే కర్
హమ్ ఘరీబూ కి మహబ్బత్ కా ఉడాయ థా మజాక్

ఒక చక్రవర్తి ధన సహాయంతో

మా పేదల ప్రేమను పరిహసించాడు

ఆ రోజుల్లో ఈ కవితను అలనాటి ఓ కవయిత్రి ఫ్రేం కట్టించి గోడకు వేలాడదీసుకుందని ఈనాటికీ లేట్ నైట్ సాహితీమిత్రుల మధుపాత్రల గలగల మధ్య రూమరవుతూనే వుంది.