1.
2.
దేవుడు చేసిన మనుషులు…అదే సూపర్ స్టార్ క్రిష్ణ గారిది….నిజానికి ఆ సిన్మా క్రిష్ణ గారు డబల్ రోల్ కోసo రాసుకున్న లేదా రాయించిన కథ. కానీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు…..కరెక్ట్….నందమూరి తారక రామారావు గారు అడిగారని చివరికి అలా వచ్చింది.
3.
మల్టీ స్టారర్ సినిమాలకు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రసుగా ఉండేది.
ఎన్టీయార్-ఏయెన్నారు, క్రిష్ణ-శోభన్ బాబు, ఎన్టీయార్-కృష్ణ మరియు మీకు తెలిసిన మరికొన్ని స్టార్లను కలపండి.
ఇప్పుడు విషయమేమిటంటే…రామారావు, క్రిష్ణలు కలిసి 6 సినిమాల్లో చేసారు. ఆ ఆరు సినిమాల్లోనూ క్రిష్ణ గారు రామారావు గారికి తమ్ముడిగానే చేసారు! రాజకీయాల్లో తప్ప!!
4.
“ఆషికి 2” సినిమా పాటలు బావున్నాయి. “మద్రాస్ కేఫ్” సినిమా బావుంది కాబట్టి మనవాళ్ళు చూడరు గాక చూడరు. మంచి సినిమాలు చూసే కళ్ళ అద్దాలు మన వాళ్ళకు ఇంకా దొరక లేదు.
సిన్మా తీసేటోళ్ళు ’అందమంతా చీరలోనే ఉంది’ అని ఇంకా నమ్ముతున్నారు! అందుకేనేమో చీరలే లేని సినిమాలని ఆదరిస్తున్నారు.. మన ప్రేక్షక దేవుళ్ళు….వెరసి నాలాంటోడికి “పృష్ట తాడనాత్ దంత భంగః”లా ఉంది వ్యవహారం.
5.
బ్యాంకు కి మేనేజర్ ఎందుకు వుంటారో నాకు తెలీదు కానీ ఈ మధ్య వక మేనేజర్ గారు అక్షరాల 45 లక్షల రూపాయలకు టొపీ వేశారట.
ఒకానొక గుడిలో అయ్యవారు శఠగోపం మింగారట.
మా వీధి మసీదులోని చిన్న అయ్యగారొకరు అమ్మాయి చెయ్యి పట్టాడని పాదరక్షల పూజ చేయించుకున్నారు.
నిన్నటి మోడీ ఇప్పుడు ఇలా వున్నాడు….మరి రేపో!?!
6.
పొలిటికల్ ఆర్ఫాన్ అనే మాట వకటుంది..మీకు తెలుసనే అనుకొంటున్నాను?
* * * * *
మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం….అంతవరకు ఖుదా హఫీజ్…సెలవ్!