ఇంతకూ ఎవరామే?
ఎవరో కాదు మన షంషాద్ బేగమే!
1996 లో అనుకుంటా షంషాద్ బేగం మరణించిందని వార్త గుప్పుమంది. T Series వారు మరో అడుగు ముందుకు వేసి ట్రిబ్యుట్ క్యాసెట్‍ను విడుదల చేసేసారు కూడా. అప్పుడూ బేగంగారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి “బాబూ! నేను చావలేదు, ఇదిగో ఇంకా బతికే వున్నాను.. కావాలంటే కళ్ళారా చూసుకోండి” అని బోసి నవ్వొకటి నవ్వింది షంషాద్ బేగం.
అక్కడితో ఆగక “ఆహా, నేనెంత లక్కీని! నా చావు వార్త నేన్ కంఫర్మ్ చేస్తున్నాను!” అని కిసుక్కున నవ్వింది.
************
బాలివుడ్ మొదటితరం ప్లేబ్యాక్ సింగర్స్ లో షంషాద్ బేగం వకరు. ప్రత్యేకమైన గొంతు ఆమెది. ఎవరి గొంతును ఆమె అనుకరించదు. ఎవరూ అనుకరించ సాహసించని గొంతు షంషాద్ ది.
***********
షంషాద్ బేగమ్ 19-04-1919 లో అమృత్‍సర్, పంజాబ్ లో పుట్టింది. సుమారు 6000 పైగా పలు భాషల్లో పాటలు పాడింది. ఆల్ ఇండియా రేడియో పెషావర్ మరియు కరాచి నుండి తన ప్రస్థానం మొదలు పెట్టింది. మెలోడి క్వీన్ మేడం నూర్జహాన్ వంటీ మహామహా గాయకురాళ్ళ మధ్య తన ఉనికి కాపాడుకుంది షంషాద్. ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదుర్ షాహ్ జఫర్ రాసిన ఆఖరి కవిత “న కిసీకా ఆంఖ్ కా నూర్ హూన్”ను షంషాద్ బేగం పాడగా రికార్డ్ అయిన మొదటి పాట.
ఒకానొక దశలొ మేడం నూర్జహాన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ వసూలు చేసిన ఏకైక భారతీయ గాయని షంషాద్ వక్కతే. నర్గిస్ తెర మీద పాడిన మొదటి పాటకు తెర వెనుక గొంతు షంషాద్ దే.
తన 94వ ఏట 23-04-2013 న మరణించింది. కాని ఆమె పాడిన “లేకె పెహ్లా పెహ్లా ప్యార్”, “కభీ ఆర్ కభీ పార్”, “కహి పె నిఘ హై కహిన్ పె నిషాన” వంటి పాటలు ఎప్పటికీ నిలిచే వుంటాయి.
{audio autostart:yes}Kahin Pe Nigaahen Shamshad Begum in CID.mp3{/audio}
ధూమపానోపాఖ్యానం మరియు ధూమోపాఖ్యానం
ధూమోపాఖ్యానం ఇతరులను కష్టం కలిగించేది కాగా ధూమపానోపాఖ్యానం మనల్ని నష్టం కలిగించేది. కొంతమందికి ఎదుటి వారి జీవితాల్లో పొగ బెట్టడమే పని . వారికి అదోరకమైన పైశాచికానందం. అలాగే పొమ్మనకుండా పొగపెట్టడం కూడా ఈకోవకు చెందినదే.. అదే పనిగా పుకార్లను గాలిపటాల షికార్లుగా ఎగరేస్తుంటారు. వకప్పుడు ఇంట్లో పాము వస్తే దాన్ని బయటకు పంపటానికి పొగ పెట్టేవారు. అలాగే పాము మనస్తత్వం కలిగిన కొంత బంధువులు ఇంటికి వచ్చినప్పుడు పొగ పెట్టక తప్పదు అంటారు పెద్దలు.
ఇక్కడితో ధూమోపాఖ్యానం సమాప్తం.
మరొకటి: ధూమపానోపాఖ్యానం,
యవ్వనపు తొలినాళ్ళల్లొ కవిత్వంతో పాటు ఇదీ జీవితంలో వక భాగం అయింది. నాగభైరవ కోటేశ్వరరావు గారి వంటి వారికి చుట్టలు కొని ఇచ్చిన భాగ్యం నాది. మో గారి పెట్టె లోంచి 2 సిగిరెట్లు దొంగిలించాను..ఎండ్లూరి సుధాకర్ గారి నుంచి ఎన్ని సార్లో! యూనివర్సిటీ నుండి ఇంటికి వెళ్తూవెళ్తూ తన డెస్క్ తాళాలు కావాలనే మరిచిపోయేవారు.
వారు వెళ్ళక నెమ్మదిగా నేను దొరలాగా వెళ్ళీ దొంగిలించేవాడిని. చూస్తే 4-5 వూదు బత్తీలతో పాటు 10-20 చిల్లరా వదిలేవారు. అప్పట్లో 10 రూపయలంటే ఇప్పుడు 100 రూపాయల కన్నా ఎక్కువే.
ఇప్పటికీ స్మోక్ జోన్ లో రోజూ కొత్త వాళ్ళు పరిచయమవుతుంటారు. అదో రెలీఫ్ అడ్డా. మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక అమ్మ నా దగ్గరకొచ్చి లైటర్ అడిగింది. “లేదు!” అన్నందుకు ఒక తియ్యటి తిట్టు తిట్టి వెళ్ళింది.
కిరణ్ నేను కలిసినప్పుడూ మా ధూమపాన రిచువల్ కి ఉక్కిరి బిక్కిరి అయ్యే సోదరుదు రఘూత్తముడు మమ్మల్ని సరదాగా శపిస్తూంటాడు – “ఇందుకే మీ ముఖవర్చస్సు తగ్గిపోతుంది” అంటూ.
ఈమధ్యనే జరిపిన వక సర్వే ప్రకారం MNC ల్లొ పని చేసే మగాళ్ళ కంటే ఆడాళ్ళే ఎక్కువ ధూమపాన ప్రియులని. ఈ లెక్కన పొగత్రాగని మగబాంధవులందరూ వచ్చే జన్మల్లో దున్నపోతులై పుడతారో ఏమో? వేచి చూడాలి!