ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఎవరికీ దొరకని మహా విషాద కావ్యం కిషోర్ కుమార్!

Like-o-Meter
[Total: 6 Average: 4.2]

1.

హిందీ వెండి తెరపై అల్లరి అంటే కిశోర్ – కిశోర్ అంటే అల్లరి.

మహా పిసినారిగా పేరు తెచ్చుకొన్నాడు. అదే పిసినారి కిషొర్ మధుబాల విషయంలో చాలా ఉదారంగా ఉన్నాడు. మరణానికి అతి సమీపంలో మధుబాల ఉందని తెలిసీ ఆమెను అమెరికా తీసుకెళ్ళి వైద్యం చేయించాడు.

మిగతా వాళ్ళతో పోల్చుకొంటే మధుబాల పట్ల కిషోర్ చాలా సప్పోర్ట్ గా నిలిచాడని చెప్పొచ్చు. వీరి ఇద్దరిది వివాహమే అయినా ఇది ఒక కన్సోల్ మ్యారేజ్ గానే గుర్తించాలి.

2.

రఫీ, మన్నా డే, తలత్, హేమంత్ లు కూడా విషాద పాటలు పాడారు. చాలా ఫేమస్ కూడా అయ్యారు. విషాద గీతాలకు తలత్, ముకేష్ లు తొలి చిరునామా అని చెబుతారు.

కానీ పైవారి జీవితాల్లో ఎవరికీ చెప్పుకోతగ్గ విషాదం లేదు. కాని, జీవితంలో చాలా సీరియస్ గా ఉండేవారు. వారందరిది చాలా ఆహ్లాదకరమైన జీవితం అనొచ్చు. కాని, కిశోరు పైకి చాలా సరదాగా కనిపించినప్పటికీ జీవితంలో బోలెడంత విషాదం వుంది.

నాలుగు సార్లు గృహదహనం అయింది.

ఒకే జీవితంలో నాలుగుసార్లు వివాహం భగ్నం కావడం ఇంకా మరెన్నో సార్లు హృదయం భగ్నం కావడం మామూలు విషయం కాదు. ఒక జీవితానికి ఒకసారి గృహదహనమే తీరని శాపం.

అలాంటిది నాలుగుసార్లు అంటే మరి కిషోర్ కు వొళ్ళంతా హృదయమే అయి ఉంటుంది.

3.

కిషోర్ ట్రాజెడీ పాటలు వింటుంటే జీవితం తనకంటూ అంత విషాదం లేకపోతే ఇలా పాడటం అసాధ్యం అనిపిస్తుంది.

బహుశా తనలోని విషాదాన్ని దాచుకోడానికి అల్లరల్లిగా కనిపించేవాడా? లేక కిషోర్ కు భరించే శక్తి అధికమా? లేకపోతే తన హృదయాన్ని పలుభాగాలుగా విడదీసి విషాదానికి ఒకటి హాస్యానికి ఒకటి, ఎంటర్టైన్మెంట్ కొరకు ఒకటి, సంగీతానికి ఒకటి, పాటలకు ఒకటి ఇలా ఇనస్టాల్  చేసుకొన్నాడా?

ఏది ఏమైనా కిషోర్ ఒక అద్భుతమే కాదు. విచిత్రం కూడా.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY