ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బద్‍కమ్మాహ్, బద్‍కమ్మాహ్ – హిందీ సినిమాల్లో బతుకమ్మ పాటలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

రాజ్ కుమార్, వహీదా ప్రభృతులు నటించిన మూవీ, షత్రంజ్ ( Shatranj ) 1969 లలో విడుదల ఐనది. ఎస్.వాసన్ దర్శకత్వంలో 1969 లో వచ్చిన హిందీ చలనచిత్రం “షత్రంజ్”. ఈ సినిమాలో ఒక పాట ఉన్నది. ఆ పాటకు చెప్పుకోదగిన అనేక విశేషాలు ఉన్నవి. ఈ హిందీ మూవీలో తెలుగు పదాల అల్లరి చిలిపి పాట ఉన్నది. మహమూద్, హెలెన్ ల జోడీ ఈ పాటకు డ్యాన్సు చేసారు.   

“బతుకమ్మ! బతుకమ్మ!బతుకమ్మ!
ఎక్కడ పోతావ్ రా?ఎక్కడ పోతావ్ రా?
ఇక్కడ్ ఇక్కడ్ రా! ……… ”

గలగలా సాగే ఈ గీతంకు మహమూద్, హెలెన్ చేసిన డాన్సు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అసలు సంగతి ఏమిటంటే – ఈ గీతిక  పల్లవిలోని మొదటి పదాలు (తెలుగు మాటలు) విరివిగా మనకు కిత కితలు పెడతూంటవి. అదీ విశేషమన్న మాట.

హెలెనీయ బ్రేక్ డాన్సు సరదా సరదాగా క్లబ్ లో సాగుతుంది. ఎంకన్న (= వెంకన్న), బత్కమ్మ- లుగా వెండి తెర పైన నర్తించినారు.

**********************

మరో ముచ్చట:- ఈ గీత గాయని “శారద”. ఈమె – అనేక పురస్కారాలను అందుకున్నది. “జీవిత చక్రం” cinema లోని (ఎన్.టి. రామా రావు, వాణిశ్రీ తారాగణం)

“కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగ మనసులో మాట ఓ బావా…”

అనే పాటను శారద గానం చేసింది.

*************
1964 లో రిలీజ్ ఐన మరో హిందీ చిత్రం లో కూడా “బతకమ్మ”  పాట ఉన్నది.
“నాచ్ రే మన్ బద్‍కమ్మా… ”  అనే ఈ పాటను లతామంగేష్కర్, ఆశా భోంస్లే కలిసి పాడారు. ప్రఖ్యాత హిందీ గీతరచయిత శైలేంద్ర ఈ పాటను వ్రాసారు. శంకర్ – జైకిషన్‍లు సంగీతం సమకూర్చారు. ఈ పాటను కథానాయకి సాధన పై చిత్రీకరించారు. సినిమాలో షమ్మీ కపూర్, సాధన, టున్ టున్ మున్నగు వారు ముఖ్య తారాగణం.
సంగీత దర్శకుడు శంకర్ హైదరాబాద్‍లో పుట్టి పెరిగిన వ్యక్తి. కనుక ఆయనకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలతో పాటు తెలుగు భాష పట్ల మంచి అవగాహన ఉండేది. కనుకనే “బతుకమ్మ”తో బాటు “రామయ్యా వస్తావయ్యా” అంటూ తెలుగు మాటలతో కూడిన హిందీ పాటలను కంపోజ్ చేసారు.
*****