ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చెదరి జారిన కుంకుమ రేఖలు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

“శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేద”నేది ఒక నానుడిగా మారిన కవి వాక్కు. అలానే ఎటువంటి పదాడంబరం లేకుండా పల్లెవాసుల బ్రతుకు పటాన్ని సున్నితంగా, సునిశితంగా ఆవిష్కరించిన పాట “ఆడుతు, పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది!”

పాటకు తగ్గ సంగీతం, ఆ రెండింటి కలయికని ఇనుమడింపజేసే చిత్రీకరణ, ఆ త్రివేణీ సంగమం ప్రక్కనే విరబూసి నిలచిన పూతీవెల్లా నటీనటుల హావభావాలు. ఒకసారి కని, విని….చవిచూస్తే చాలు…మన కార్పొరేట్ ఇరుకు జీవితాల్లో కొద్దిపాటి చల్లదనం, కొద్దిపాటి వెచ్చదనం, మరికొద్దిగా భావ వైశాల్యం…ఏమంటారు!