ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

దేశమ్ము మారిందోయ్!!

Like-o-Meter
[Total: 0 Average: 0]

అల్లరి చిల్లరి భీముడు రాముడుగా మారి బావగారి భరతం పడుతోంటే పిరికి రాముడు కాయకష్టపు భీముడిగా మారి పేద్ద ఆనకట్టను బ్లాక్ & వైట్ లో కట్టేస్తాడు….ఆంధ్రప్రదేశ్ లోనే. నిజంగా కాదులేండి “రాముడు భీముడు” సినిమాలో.

ప్రేమ పాటలు, డ్రామా పద్యాల మధ్యన చటుక్కున తగిలే ఈ అభ్యుదయ గీతం వీనులవిందు, కనుల పసందే కాదు, కించిత్ ప్రభోదాత్మకం మరి కించిత్ ఆలోచనాత్మకం. చూస్తూ వినండి…


“అక్రమాలకు, అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే”


అప్పట్లో ఉన్న అవినీతికి ఒక్క ఆనకట్ట సరిపోయేదేమో! ఇప్పుడు ఆనకట్టలే అవినీతికి తొలి మెట్లు. కేవలం మాటల్లో కట్టలు కట్టేస్తే చాలదేమో!