Like-o-Meter
[Total: 0 Average: 0]
ఆ రోజుల్లో పూర్తిగా కొత్త వాళ్ళతో తీసి ఎన్నో అవార్డ్లు సాధించిన ఈ చిత్రంలో, సీతారామ శాస్త్రి రాసి, స్వయంగా పాడిన ఈ పాట, సాహితీ పరంగా ఓ ఆణిముత్యం. బాలసుబ్రమణ్యం సంగీతం అందించిన ఈ పాట సాహిత్యం “ఆవకాయ” ద్వారా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
తెల్లారింది లెగండో కొక్కురోకో, మంచాలింక దిగండో కొక్కురోకో
పాములాంటి చీకటి పడగ దించి పోయింది , బయం నేదు బయం నేదు నిదర ముసుగు తీయండి
చావు లాంటి రాతిరి సూరు దాటి పోయింది , బయం నేదు బయం నేదు చాపాలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిచింది , మూసుకున్న రెప్పలిప్పి సూపులెగరనియ్యండి
తెల్లారింది లెగండో కొక్కురోకో, మంచాలింక దిగండో కొక్కురోకో
చురుకు తగ్గిపోయింది చందురునికంటికి , చులకనైపోయింది లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం , ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా చూసేకన్నూ, ముసురుకుందా మైకం మన్నూ మిన్నూ
కాలం కట్టిన గంతలు తీసి , కాంతుల ఎల్లువ గంతులు వేసి
తెల్లారింది లెగండో కొక్కురోకో, మంచాలింక దిగండో కొక్కురోకో
ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం, ఎక్కుపెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడా , ఊపిరితో నిలబడుతుందా చిక్కని పాపాల పీడా
సెమటబొట్టు చమురుగా సూరీడ్ని ఎలిగిద్దాం , వెలుగుచెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వేకువ చెట్టున కత్తులు దూసి , రేతిరి మత్తును ముక్కలు చేసి
తెల్లారింది లెగండో కొక్కురోకో, మంచాలింక దిగండో కొక్కురోకో