ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

కూజాలో కిషోర్ కుమార్

Like-o-Meter
[Total: 0 Average: 0]

కిషోర్ కుమార్ తో తమ సినిమా గురించి డిస్కస్ చెయ్యడానికి ఒక నిర్మాత, దర్శకుడు అపాయింట్మెంట్ అడిగారు. కిషోర్ ఇచ్చాడు.

కరెక్ట్ గా ఆ డేట్ & టైమ్ కు వాళ్ళిద్దరూ కిషోర్ ఇంటికి వచ్చారు. కిషోర్ సెక్రెటరీ వాళ్ళని రిసీవ్ చేసుకొని హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. దాదాపు మూడు-నాలుగు గంటలపాటు ఆ నిర్మాత, దర్శకులు కూర్చొని కూర్చొని విసుగెత్తిపొయ్యారే గాని కిషోర్ జాడ లేదు. చివరకు వారు లేచి వెళ్ళిపోబోతుండగా హాల్లో ఒక మూలన పెట్టివున్న పెద్ద కూజాలో నుంచి కిషోర్ కుమార్ బైటకొచ్చాడు.

ఆశ్చర్యపోయిన ఆ ఇద్దరూ “ఇదేం పని?” అని అడిగితే “నేను లేనప్పుడు నా గురించి మీరేం మాట్లాడుకొంటారో తెలుసుకొందామని అలా దాక్కొన్నాను” అని చెప్పాడు కిషోర్.

తప్పుడు మాటలేమీ మాట్లాడలేదని సంతోషపడాలో, మూడు గంటలు ఊపిరాడని కూజాలో కూర్చున్న కిషోర్ పిచ్చికి భయపడాలో అర్థంకాక వాళ్ళిద్దరూ అవస్థపడిపోయార్ట!

That is Kishoreda!!