ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ!

Like-o-Meter
[Total: 0 Average: 0]

అది తెలుగో, ఇంగ్లీషో, హిందీనో ఏమీ అర్థం కాని ఈనాటి మన సినిమా పాటల రణగొణధ్వనుల మధ్య ఇంచుక మంచి గీతం, సంగీతం వినడం ఎంతైనా అవసరం. కాస్త మానసిక ప్రశాంతత కావాలనుకొనే వాళ్ళ కోసం చిట్టి, పొట్టి మాటల్లో రసవత్తరమైన భావాలను నింపుకొన్న కొన్ని సినిమా గీతాలు ఒక్కొక్కటిగా చవి చూద్దాం.

ఎప్పుడో నలభై, యాభై యేళ్ళ క్రితమే అటు పరిసర పరిరక్షణ, ఇటు చక్కటి వినోదాన్ని పంచిన గీతాల్లో తెనాలి రామకృష్ణ లోని ఈ పాట.

రహదారి వెంట మొక్క నాటి పెంచరా
కలవారు లేని వారు నిన్ను తలచురా
భువిని తరతరాల నీదు పేరు నిలచురా
పని చేయువాడే ఫలము నారగించురా

ఎంత గొప్ప మాట! ఎంత గొప్ప భావం!