ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఎన్టీయార్ అంకితభావం

Like-o-Meter
[Total: 1 Average: 5]

క్రమశిక్షణకు, పట్టుదలకు పేరైన రామారావు నటజీవితంలో కొన్ని మరపురాని ఘటనలు ఉన్నాయి.

అందులో ఇదొకటి…

ఎన్టీయార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం చిత్రంలో ఒక సందర్భంలో రావణాసురుడు తన పది తలల మీద కైలాస పర్వతాన్ని మోస్తున్నట్టు చూపించాలి.

మామూలుగా ఐతే రావణ పాత్రధారి ముఖాన్ని పోలి ఉండేట్టుగా మరో తొమ్మిది అట్ట తలల్ని చేసి షూట్ చేసేవాళ్ళు. కానీ మహా పర్ఫెక్షనిస్టైన రామారావు దానికి ఒప్పుకోలేదు. మొత్తం పది ముఖాలు తనవే, సజీవంగా రావాలని పట్టుబట్టారు. అందుకుగాను ఛాయాచిత్రకారుడుగా పని చేసిన రవికాంత్ నగాయిచ్ ఒక క్లిష్టమైన ప్రక్రియను ప్రతిపాదించారు.

   Ravikanth Nagaich               Image : www.veethi.com

అదేమిటంటే రామారావు ముఖాన్ని తొమ్మిది విడి భాగాలుగా షూట్ చేసి, ఎడిటింగ్ చేసి స్క్రీన్ పై ఆ పది ముఖాలూ వచ్చేట్టు చేయాలి. ఆ తర్వాత వచ్చే సీన్ లో శివుడు తమ బొటనవేలితో కైలాస పర్వతాన్ని నొక్కితే, ఆ బరువును తట్టుకోలేక రావాణాసురుని ఒక్కొక్క తలా మాయమైపోతుంది.

అలా తొమ్మిది తలలూ రావడానికి గంటల సమయం పట్టవచ్చునని రవికాంత్ నగాయిచ్  చెప్పారు. అయినా సరే చేద్దామన్నారు రామారావు. ఆవిధంగా అక్షరాల ఎనిమిది గంటలు కదలకుండా కూర్చొన్నారట రామారావు !

 

ఈ సన్నివేశంను పరికించి చూస్తే, మాయమైపోయే ప్రతి ముఖం స్థానంలో ఒక చిన్న బాక్స్ కనబడుతుంది. (Watch the video from 08:50 mins. onwards)