ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పాడవోయి భారతీయుడా

Like-o-Meter
[Total: 0 Average: 0]

pay per click

1961లో విడుదలైన “వెలుగు నీడలు” సినిమాకు శ్రీశ్రీ వ్రాసిన పాట. ఇప్పటికీ అన్వయించుకో దగిన పాట ఇది.

 

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతిక

నేడే స్వాతంత్ర్య దినం

వీరుల త్యాగఫలం

నేడే నవోదయం

నీకే ఆనందం

 

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి

సంబర పడగానే సరిపోదోయి

 

సాధించిన దానికి సంతృప్తిని చెంది

అదే విజయమనుకుంటే పొరపాటోయి..

 

ఆగకోయి భారతీయుడా

సాగవోయి ప్రగతి దారులా…

 

ఆకాశం అందుకునే ధరలొకవైపు

అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు

అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు

అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు

 

కాంచవోయి నేటి దుస్థితి

ఎదిరించవోయి ఈ పరిస్థితి

 

పదవీ వ్యామోహాలు కులమత బేధాలు

భాషా ద్వేషాలు చెలరేగే నేడు

 

ప్రతి మనిషి మరి యొకని దోచుకునే వాడే

తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునే వాడే

 

స్వార్ధమే అనర్ధ కారణం

అది చంపుకొనుటే క్షేమ దాయకం

 

సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం

సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం

ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే

లోకానికి మన భారత దేశం

అందించునదే శుభ సందేశం