ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పేరు లేకుండా పాటలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

రాసి జనాలను, రాయక నిర్మాతలను ఏడిపిస్తారని సినీ గేయ రచయిత ఆత్రేయ గారి గురించి చెప్పుకుంటారు. అలాగే, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారిని కూడా భరించటం కష్టమే అని అప్పట్లో చెప్పుకునేవారట నిర్మాతలు.

కారణం ఏమంటే, అనుకున్న మ్యూజిక్ సిట్టింగ్సుకు వేళకి రాకపోవటం. అలానే, రికార్డింగులకు కూడా సరిగా రాకపోవటం. ఇంకా ప్రొడక్షన్ విధానంలో అనుమానం వచ్చినా ఆయన ఆ సినిమా మానేసేవారట!

ఆ కారణంగా, కొన్ని సినిమాలకు సంగీత దర్శకుడుగా కొన్ని పాటలు చేసినా, ఆయన తప్పుకోవటంతో ఆయా పాటలకు ఇతర సంగీత దర్శకుల పేర్లే వేయటం జరిగింది.

ముఖ్యంగా నమ్మినబంటు చిత్రంలో ‘చెంగు చెంగునా…’, ఎన్.టి.ఆర్. సీతారామకళ్యాణం చిత్రంలో ‘కానరార…’ అన్న పాట, ఆ తర్వాత వచ్చే దండకం. ఇంకా, దానవీరశూరకర్ణ సినిమాలో ‘ఏ తల్లి నిను కన్నదో…’ ఇవన్నీ రాజేశ్వరరావుగారు స్వరపరచినవే అయినా, ఆ తర్వాత ఆ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినవారికే క్రెడిట్ దొరికింది.

ఇక ‘మాయాబజార్’ పాటల సంగతి కూడా ఆరోజుల్లో ఇలానే చెప్పుకునేవారు.