ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పోతే….!!!

Like-o-Meter
[Total: 0 Average: 0]

“వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు పల్లదనంబును…..” అంటూ ఏడు వ్యసనాల్ని ఏకరవు పెట్టాడు విదురుడు.

“మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః…” అని పద్దెనిమిది వ్యసనాల్ని పట్టీ వేశాడు మనుస్మృతికారుడు.

కాలం మారింది, భాష మారింది, మనుషులు పూర్తిగా మారిపోయారు. సంస్కృతం తెలీదు, తెలుగు రాదు. ఇంగ్లీషు చచ్చినా పోదు. మరి ఈ నిర్భాషా జాతికి హితోపదేశం ఎలా చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

పేకాటవంటి దుర్వ్యసనానికి బానిసైతే పురాణకాలంనుండి రేలంగి, రమణారెడ్డి కాలంవరకూ సంభవించిన కష్ట నష్టాల పరంపరని ఏకరువుపెట్టి తమాషాగానూ, హితోపదేశంగానూ సాగే ఈ పాట ఈనాటి పేకాటరాయుళ్ళకు కూడా గీతోపదేశం లాంటిది. 

“పోతే…అనుభవమ్ము వచ్చు…” అన్న శ్రీమాన్ రేలంగోవాచను వినండి! వ్యసనాలను వీడండి!

 

 

“నిలువుదోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది – ఎంతో పుణ్యం చిక్కేది – చక్కెర పొంగలి చిక్కేది

అదండీ వీరభక్తి అంటే!!