ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పుట్టినరోజు జేజేలు – ఇంతకీ ఎవరు ఆమె?

Like-o-Meter
[Total: 0 Average: 0]

అక్కినేని నాగేశ్వర రావు, బి.సరోజాదేవి, హరనాథ్, నాగయ్య, రేలంగి, గిరిజ, సూర్యకాంతం మున్నగువారు నటించిగా, 1964 లో విడుదల ఐన తెలుగు చలన చిత్రము “అమర శిల్పి జక్కన” లోని ఈ పాట గుర్తుందా!?

(అతడు):-

మల్లెపూల చెండు లాంటి చిన్నదానా!

నా  మనసంతా నీ  మీద పిల్లదానా!

(ఆమె):-

చూడ చూడ వేడుకైన చిన్న వాడా!

చూడకోయి నిక్కి నిక్కి సొగసుకాడా!

(అతడు):-

కొమ్మ మీద పండువే! కోనంతా రాలునా?

(ఆమె):-

కొమ్మనే గుంజితే కోంగులోన రాలునా?||

(అతడు):-

ఊరించి పోబోకుకు నువు కొంటెగా,

(ఆమె):-

పరువాలు నీ పాలు అని అంటిగా!

(అతడు):-

వరి చేల మీద ఒట్టేసి పోవే!

(ఆమె):-

సరి ఓళ్ళు చూస్తారు రాలుగాయీ!

(అతడు):-

పట్టుచీర, జరీ రైక పట్టుకు రానా?  

(ఆమె):-

తాళిబొట్టు, బాసికట్టు తప్పక తేరా!

(అతడు):-

ఔర, బుల్లీ! అత్త కూతురా!

మేనత్త కూతురా!

(ఆమె):-

రంగేళి రంగా! రచ్చ మానరా!

బంగారు బావా! నీ తిక్క మానరా!

*****


ఐతే ఈ పాట యొక్క  స్పెషాలిటీ ఏమిటని అంటున్నారా?

ఈ గీత నృత్యకారిణికి అనేకమంది అభిమానులు ప్రత్యేక జేజేలులను మొన్ననే అందించారు.

ఇంతకీ ఎవరు ఆమె?

“ఆమె ఎవరు?” అనే సినిమాను జ్ఞాపకం తెచ్చుకొంటే సరి! చప్పున గురుకువస్తుంది, ఆమె పేరు- ఆమెయే డాక్టర్ జె. జయలలిత (Birthday – February 24, 1948)

డాక్టర్ అంటే- స్కెతస్కోపు డాక్టరు కాదండీ! సినీ కళారంగంలో జయకేతనమును ఎగరేసిన విజయ వనిత, రాజకీయాల్లోకి అడుగిడిన ఆమె కీర్తిపతాకను రెపరెపలాడించారు.

1963లో చిన్నద గొంబె అన్న కన్నడ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమెఈ గీత నాట్యములో నిండుగా చీరకట్టుతో, పదహారణాల తెలుగు పిల్లదానిగా జానపదానికి హొయలు చూపించినది.

తమిళనాడుకు ముఖ్యమంత్రిణిగా అసంఖ్యాక సంచలనాలు సృష్టించిన మహిళా శిరోమణి, పురచ్చి తలైవి (Revolutionary Leader) బిరుదాంకితురాలు జయలలితకి జన్మదినశుభాకాంక్షలు.