1950 లో విడుదలైన “సంసారం” చిత్రం ఘనవిజయం సాధించిన అప్పటి చిత్రాల్లో ఒకటి.
ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి ప్రముఖ కథనాయకులతో బాటు లక్ష్మిరాజ్యం, పుష్పవల్లి, నల్ల రామ్మూర్తి వంటి సీనియర్ నటులు నటించారు.
ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే మహానటి సావిత్రికి ఇది మొదటి సినిమా.
అక్కినేనిని చూస్తూ “అచ్చం హీరో నాగేశ్వరరావులా ఉన్నావే!” అన్నది ఆమె చెప్పిన
తెరపైని విశేషాలు ఇవైతే, తెర వెనుక జరిగిన ఓ తమాష సంఘటనని చెప్పుకుందాం.
“సంసారం” సినిమా తీస్తున్న శ్రీమతి లక్ష్మీరాజ్యం, సంగీత దర్శకత్వాన్ని సుసర్ల దక్షిణామూర్తికి అప్పగించాలని నిర్ణయించారు.
సుసర్లను పిలిపించారు ఆవిడ.
“ఏమబ్బాయ్! “సంసారం” చేస్తావా?” అని ఆవిడ అడిగేసరికి అక్కడున్న మందీ మార్బలమూ చటుక్కున నవ్వారు.
అప్పటికి తన మాటలలో పొరపాటు అర్ధం దొర్లిందని గ్రహించిన లక్ష్మీరాజ్యం కూడా నవ్వేశారు.
*****