ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బర్హిపింఛధారి

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఉత్థాన ఏకాదశి విశిష్టమైనది.  కార్తీకశుక్ల పక్షమున ఉన్న పండుగ, నోము ఇది. ఉత్థాన ఏకాదశికి నాలుగు పేర్లు కలవు – (1) హరిబోధిని; (2) ప్రబోధిని; (3) దేవోత్తని; (4) ఉత్థాన ఏకాదశి.

ఉత్థానఏకాదశిన నెమలిఈకలను (peacock feathers) దానము చేయుట పుణ్యప్రదము. 


 

బర్హిపింఛధారి

ఆ అందచందముల చూసితే చాలని 

అంటారు ఎల్లరూ!

చాలు! చాలనుచును – చాల కోరికలు గద! 

ఎలమి ఈ లోకులందరికిని! 

శిఖిపింఛధారిని దర్శించాలని – అందరికి ఆపేక్ష  ||

 

నెమలి పింఛమ్ములను నీ బర్హిలోనుండి

కోమలముగా వలిచి ఇవ్వవమ్మా కేకి! 

ఈ రోజు మంచిది, నీకు పుణ్యము దక్కు!

ఉత్థాన ఏకాదశి! నేడు ఉత్థాన ఏకాదశి! ||

 

పింఛములు కాసిన్ని మాకివ్వవోయీ! నెమలి! 

నీ వన్నె ఈకలు కొద్దిగా చాలును 

మారాము చేయకే ఓ మయూరి! 

ఎవ్వారి ‘చాలు’ ఈ పెంకితనము;

నీకిట్లు కలిగేను చెప్పవమ్మా!  ॥ 

 

నాణెమైన ఈకలివ్వమ్మ నువ్వు

వెన్నెల, హరివిలులు, కన్నయ్య నగవులు 

వెల్లివిరియును అందు, అందుకోగలవీవు!     

ఉత్థాన ఏకాదశి, నేడు ఉత్థాన ఏకాదశి! ||  


చాలు = పోలికచాళ్ళు = పోలికలు