ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ధనుర్మాసం

Like-o-Meter
[Total: 0 Average: 0]

హృదయ కవాటం తెరుచుకుంది

అరుణోదయ కాంతి తాకగానే

నులివెచ్చని ఆశ చిగురించింది

హరిదాసు కీర్తన వినగానే

నెలవంకను మధ్యన నిలిపి

తనచుట్టూ రంగవల్లులు వేసి

చలితో ముడుచుకున్న చెట్లను చూసి

చన్నీళ్ళ స్నానం ముగించి

వడివడిగా గుడివైపు నడుస్తుంటే

తిరుప్పావై పఠనం శఠారి లా పనిచేసింది

స్థిరమెరిగిన బుద్ధి మనస్సుని మెప్పించింది

మంచుబిందువొకటి సరస్సుతో సంగమించింది

వికసించిన కమలం స్వచ్చతను చాటింది

కడిగిన మంచి ముత్యాలా?

కావవి కన్నెపిల్లల కదలికలు

హరిసన్నిధి లో పూర్ణేందువదనాలు

భానుడికి పలుచంద్రుల పలకరింపులు

పోతన్న పద్యం మధ్యలో ….

 

నమ్మితి నామనంబునసనాతనులైన ఉమామహేశులన్.

మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మమేటి పె.

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిన్ పతి సేయుమమ్ము !

నిన్. నమ్మిన వారి కెన్నటికి నాశములేదు గదమ్మ!ఈశ్వరీ!”

 

భక్తి పారవశ్యంలో కౌమార వేదాంతం

భారతీయ వివాహ వ్యవస్థకు మూలస్థంభం

అపార విశ్వాసం అకుంఠిత దీక్ష

కలగలిపి ఆచరించె కాత్యాయనీ వ్రతం