ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా

Like-o-Meter
[Total: 1 Average: 4]

క్షేత్రయ్య పదాలు – ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా

ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా
పంతమా మువ్వగోపాల నా సామి      ||ఇంత తెలిసియుండి||

అలుకచేసి యింటికి రావైతివి నెవరైన
చెలికత్తెలున్నారా – పిలువవచ్చేరా
చెలికత్తెవైనా నీవే చెలుడవైనా నీవే
తలచిచూడ నాపాలి దైవము నీవేి      ||ఇంత తెలిసియుండి||

వింతదానివలె నన్ను – వేరు చేసి రావైతివి
అంతరంగులున్నారా? నన్నాదరించేరా?
అంతరంగమైనా నీవే ఆదరించినా నీవే
చింతించిజూడ నా జీవనమ్ము నీవేి      ||ఇంత తెలిసియుండి||

శ్రీనిధి! మువ్వగోపాల! చేపట్టి నన్నేలితివి
నా నేర్పులెవరైనా – నందించేవారా?
నా నేర్పులైనా నీవే నమ్మికలిచ్చిన నీవే
యానగా బలికెద నా యానందమైనా నీవేి      ||ఇంత తెలిసియుండి||

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>