Like-o-Meter
[Total: 0 Average: 0]
అతివలందరూ ఆర్తితో ఎదురుచూసే కార్తీకం
దీపావళి సరదాల పరదా తీసి వచ్చింది
భ్రూ మధ్యమున కుంకుమ నొసటన భస్మరేఖ
భాసించే మోముతో ప్రాతః కాలంలో
కార్తీక దామోదరుని కీ కైవల్య జ్ఞాన ప్రదాత శివునికి
కైమోడ్చి ప్రార్ధనలు చేసేందుకు సమాయత్త మౌతున్నారు
ప్రశాంత వదనంతో మనుషుల్లో భక్తులు బయల్పడి గుడివైపు
సాగే సమయం వచ్చింది గుండె గుడి తలుపు తెరుచుకుంది
దూదెవత్తులు, ఆవునెయ్యి, ఆవు పాలు, అరటిపళ్ళు
కొబ్బరి కాయలు, హారితి కార్పూరం, అగరువత్తులు
అభిషేకాలు, అర్చనలు, మహా నైవేద్యాలు
ప్రసాదాలు, ప్రశాంత వాతావరణాలు
మళ్ళీ ఒక మాసం మొత్తం మకాం వేయడానికి వస్తున్నాయి
ప్రాతః కాలాలు, ప్రదోష వేళలు
వీధులన్నీ భక్తుల పదఘట్టాలతో
విర్రవీగే రోజులోస్తున్నాయి
వేదనలు ప్రార్ధనలుగా మారబోతున్నై
చలి పులి సంచారం
సడి లేకుండా మొదలౌతుంది
చినారులు వృద్ధులు
దుప్పట్లను ఆశ్రయిస్తే సరిపోతుంది
శరత్కాలపు వెన్నల నులివెచ్చని భావన
గుడిలో మ్రోగే గంట అమ్మ వండిన ప్రసాదం
ఆస్వాదించే కాలం ఆసన్నమౌతోంది
మానవ జీవితాల్లో మధురమైన పుట ప్రారంభమౌతోంది