ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నవరాత్రి – మా కనక దుర్గా!

Like-o-Meter
[Total: 0 Average: 0]

నవరాత్రి

వనదుర్గమ్మ కొలువైన –
నవ రాత్రి వచ్చినది
అర్చన సామగ్రితోటి
వైనంగా కదలండీ! ||

భావించగ, భవానీకి
నవ రాత్రీ పల్లకీ !
మా భక్తి నెలవు పసిడి తేరు
ఇవే మాకై మోడ్పులు ||

చల్లని నీ చిరు నవ్వులు
వెదజల్లీ ధరిత్రిని
సస్య శ్యామల
మొనరించును దుర్గమ్మ ||

 

మా కనక దుర్గా!

కదంబ సుమ వనమ్ములందున
పరీమళమ్ముల వాహినీ!
రత్న మణి హార ధారిణీ! –
మా – జనని దుర్గమ్మ!
అందుకోవమ్మా మా నమస్సులు! ||

శుక శౌనకాది వర్ణిత!
సకల లోక వందిత!
జలధి వర్ణపు సుగాత్రీ!
విలసత్ రజిత వాస విలాసినీ!
మా – జనని దుర్గమ్మ!
అందుకోవమ్మా మా నమస్సులు! ||

ముకుళ సుమ దళ పల్లవాంగుళి
సకల లోకము రాగ వీణ్ల
అను రాగ ధారా వర్షిణీ!
అభీష్ట వర ప్రదాయినీ!
మా కనక దుర్గా!
అందుకోవమ్మా మా నమస్సులు! ||

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>