ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఓం నమః శివాయ

Like-o-Meter
[Total: 0 Average: 0]

 ఓం నమః శివాయ——-        ll 5 ll

పరమేశ్వరా పార్వతీ పరమేశ్వరా 

ప్రణమిల్లి మ్రొక్కెద ప్రమధ గణనాధా 

ప్రణామములివె నీకు భక్త సులభంకరా     ll ll

 

భువనములోని అందములన్నీ 

కాంచగ మాకీనయనములొసగిన 

జ్యోతిర్లింగా ……. జ్యోతిర్లింగా నీకిదె 

దీపంసమర్పయామి               ll 3  ll 

 

భువిలో విరిసిన సుగంధములన్నీ 

ఆఘ్రాణించగ మాకునాసికనొసగిన

ఫణిభూషితలింగా …….. ఫణిభూషితలింగా నీకిదె   

ధూపంసమర్పయామి      ll 3  ll

 

పుణ్యక్షేత్ర జేగంటా నాదముల 

శ్రవణము సేయగా మాకుకర్ణములొసగిన

కరుణాకరలింగా……. కరుణాకరలింగా నీకిదె 

పుష్పంసమర్పయామి                 ll 3  ll 

 

ప్రకృతిలోని భావములన్నీ 

వ్యక్తము సేయగా మాకుస్పర్శను ఒసగిన 

బిల్వార్చితలింగా………బిల్వార్చితలింగా నీకిదె 

చందనంసమర్పయామి              ll 3  ll

 

నలభీమాదుల షడ్రసోపేతముల 

ఆస్వాదించగ మాకుజిహ్వను ఒసగిన 

పరమాత్మకలింగా…….. పరమాత్మకలింగా నీకిదె  

నైవేద్యంసమర్పయామి          ll 3  ll 

 

పంచాక్షరీ నామ మహిమాన్వితముచే 

పంచక్రియాజ్ఞానేంద్రియములమాకొసగిన 

మహాప్రాణలింగా…….మహాప్రాణలింగా….. నీకివె 

మా ప్రణామములు 

 

ఓం నమః శివాయ——-        ll 5 ll