ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పద్మావతి గైకొనుమా హారతి

Like-o-Meter
[Total: 0 Average: 0]

సకల కళా భూషిత
కలవాణీ! పద్మావతి!
గైకొనుమా హారతి ||

సప్తగిరుల స్వామికి
అనురాగపు దేవేరివి
మీ ఇరువురి దర్శనముల
తరియింతురు భక్త కోటి ||

శరణు కోరి నీ దరిని
చేరిన శిశువులము తల్లి!
వత్సలను లాలించి
పాలించుట నీ ఫణితి ||