ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పండిన మనుషులు

Like-o-Meter
[Total: 0 Average: 0]

నవరాత్రులు గడచిపోయాయి

దీపావళికి స్వాగతం పలుకుతూ

మిరిమేట్లు గొలిపే కాంతులీనుతూ

దేదీప్య మానంగా దీపావళీ వెళిపోతుంది

ఆర్తి తో వేడుకొనే భక్తులకు

కార్తిక దామోదరుని కరుణా కటాక్షాలను పొందమని

ఇలా ప్రతి ఏడూ పలు  పండుగలు
మనిషిని పండిపొమ్మని గుర్తు చేస్తాయి
ఋతు శోభలతో పలుకరిస్తాయి


పులకించి తరించే మనుషులు

పూజలు చేయనవసరం లేదు
పొంగిన మనసుతో పువ్వులలో పరమాత్మను చూడగలరు
కాలచక్ర గమనాన్ని ప్రతి క్షణం ఆస్వాదించగలరు
నిరాశ, బెంగ, భయాలకు అతీతులు కాగలరు


ఎందుకంటే వీరు సంపూర్ణ శరణాగతి చేసారు!