ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

రాలిన పూలను జూచి…

Like-o-Meter
[Total: 1 Average: 4]

రాలిన పూలను జూచి జాలిని చూపగ జాలక
కూలిన మానవుల జూచి చలించగలవే? మరి చలించగలవే?

మదిలో సద్ధర్మమ్ముల వదలక సత్కర్మమ్ముల
సదమల సద్భాషణముల సద్దే లేకున్న
ఇద్ధరలో నాకము కోరిన – భువిపై శాంతిని లేదన్న
సాధ్యమా! సంతతముగ సాధన మరచిన ఓ జీవి?

పరహితమన్నది ఎరుగక – పరగతి పథమును అరయక
పరిపరి దుష్కర్మమ్ముల వెరవకనే జేసి
నర నట విటులనె దేవరలని తలచీ గొలిచీ
హరికథ సుధలను బోనాడిన ఓ జీవీ