రామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రామనామము రమ్యమైనది రామనామము
జ్ణానదృష్టిని చూడగలిగిన మాననీయము రామనామము
నిరుపమానము నిర్విశేషము నిష్కళంకము రామనామము
చూపు నిలిపి భజించువారికి సుఖమునొసగును రామనామము
పంచవింశతి తత్వములకు మించియున్నది రామనామము
పంచదశ మంత్రాక్షరములకు ప్రాణకరము రామనామము
నాదబిందు కళామయంబగు వేదమంత్రము రామనామము
సకలలోకముల భరియించెడి సత్యరూపము రామనామము
సప్తవ్యసనములను హరియించెడి బధ్ధసూత్రము రామనామము
మూడుమూర్తుల జన్మభూమికి మూలదైవము రామనామము
పండువెన్నెల కాంతిగల్గిన బ్రహ్మనాళము రామనామము
అన్నిరూపంబులు తానై యాడుచున్నది రామనామము
అష్టదళముల కమలమందున అమరియున్నది రామనామము
శోకమోహ వినాశకరమై చూచుచున్నది రామనామము
మూడునదులను దాటువారికి మోక్షలక్షిమ్ యు రామనామము
ఆదిమూలప్రకృతి గతికి అనాదియైనది రామనామము
భజనపరులకు ఎల్లకాలము బ్రహ్మయజ్ణము రామనామము
భక్తపరులకు క్షేమకరమై ప్రబలుచున్నది రామనామము
కుశలబుధ్దిని గలిగి దలచిన కోర్కెదీర్చును రామనామము
సప్తకోటి మంత్రములకును గుప్తమయినది రామనామము
మానసానందము నొసగెడి మౌనమే శ్రీరామనామము
నరకమును చీకటికి సదమల తరణిబింబము రామనామము
విష్ణులోకము శైవలోకము విశ్వమయమగు రామనామము
విష్ణుమాయను గెలుచువారికి విశదమగు శ్రీరామనామము
నిత్యముక్తికి నిత్యభుక్తికి సత్యవచనము రామనామము
సర్వమును వ్యాపించియున్నది సత్యముగ శ్రీరామనామము
సర్వమును వ్యాపించియున్నది సత్యముగ శ్రీరామనామము
రామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రామనామము రమ్యమైనది రామనామము