దశరధుడు
ముగ్గురి పెనిమిటి
అయోధ్య రాజు
ఆ మారాజుకి
పిల్లలు పుట్టలేదు
యజ్ఞం చేసెను
అగ్నిదేవుడు
ఇచ్చిన పాయసాన్ని
భార్యలకిచ్చె
పుట్టారపుడు
పిల్లలు నలుగురు
ఆనందించాడు
రామ లక్ష్మణ
భరత శతృఘ్నులు
తన పిల్లలు
జనకునికి
కూతురు దొరికింది
సీత రూపంలో
స్వయంవరంలో
విరిచాడు రాముడు
శివధనస్సు
సీతతో పెండ్లి
జరిగింది రాముడికి
వైభవముగా
అయోధ్యలోన
కైకేయి పెట్టినది
మడతపేచీ
పంపించాలంది
రాముని అడవికి
వనవాసిగా
బయల్దేరాడు
సీతాలక్ష్మణులతో
రాముడు ఇక
ఒక రక్కసి
రాముని వెంటాడగా
తమ్ముడు జూసె
శూర్పణఖవి
ముకుచెవులుకోసి
చేతిన బెట్టె
మాయలేడిని
చూసిన సీతాదేవి
కావాలనెను
రాముడేతెంచే
తరువాత తమ్ముడు
లక్ష్మణుడెళ్ళె
రావణుడొచ్చి
భిక్షమునడగుచూ
కుట్రనుపన్నె
లక్ష్మణ రేఖను
దాటిన సీతమ్మను
అపహరించె
హనుమంతుడు
రాముని భక్తుడయ్యి
లంకనిజేరె
సీతను జూసి
తను తీసుకొచ్చిన
ముద్రిక జూపె
రాక్షస మూక
తనను బంధింపగా
లంకను గాల్చె
వానర సేన
సాయముతో రాముడు
వారధి కట్టె
సేతువు దాటి
లంకను జేరగనే
యుధ్ధముజేసె
ఆ యుధ్ధమున
హతుడై రావణుడు
నేలన్ గూలె
సీతతో సహా
మన రామయ్యతండ్రి
అయోధ్యజేరె!