ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శంకర జయంతి శుభాకాంక్షలు.

Like-o-Meter
[Total: 0 Average: 0]

శంకరుల  అద్వైతం, మాయా వాదం ఆయన అనంతరం ఎందఱో ప్రచారం చేసి దానికి విశిష్టమైన స్థానాన్ని సమాజంలో ఇవ్వడానికి  దోహదపడినప్పటికీ ఆయన చేసిన స్తుతులు, స్తోత్రాలు, స్థావాలు, షన్మత  స్థాపన సమాజంలో ఆధ్యాత్మికత వేళ్ళూనుకోవడానికి  కారణం అనడంలో ఏమాత్రం శంశయం లేదు. ఆయన చేసిని కొన్ని వింతలు సనాతన ధర్మంపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రజల్లో కలుగచేసాయి. అందు ముందుగా ఆయన చేసిన కనకధారా స్తవం పిమ్మట ఆయన శిష్యుడైన పద్మపాదుల నీటిపై నడక గురువు పట్ల గౌరవాన్ని ఇనుమడింప చేసాయి. అయన చేసిన “భజగోవిందం” సమస్త మానవ జాతికి ఒక మార్గదర్శనం.  అట్టి మహనీయుడు ప్రాతః  స్మరణీయుడు. 

శంకరుల సిద్ధాంతాన్ని విశిష్టంగా అవగాహన చేసుకొని రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని  ప్రతిపాదించారు. రామానుజుల ప్రతిపాదనను  ఇంకా శోధించి ద్వైతాన్ని ప్రతిపాదించారు మధ్వాచార్యులు.  ఇలా సనాతన ధర్మాన్ని ఈశ్వర తత్వాన్ని జీవి కి ఈశ్వరునకు ఉన్న సంబంధాన్ని సాధకులు అర్థం చేసుకోవడానికి శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు ఎంతో వాగ్మయాన్ని ఇచ్చారు.  సాధకుడు అసూయ లేకుండా వీరి వాదాలను చదివి, అర్థం చేసుకొని తన మనసుకు గోచరమైన విశిష్టమైన సాధనా మార్గాన్ని ఎంచుకొని ఆ దారిన పయనించడం వినా వేరే మార్గం లేదు.

ఇలానే ఎందఱో సాధకులు వారు విశ్వసించిన మార్గాన్ని ఎన్నుకొని ఆనందానుభూతిని పొందుతున్నారు.  ఇందు గ్రహించ వలసిన విషయం అసూయ లేకుండా ఆ మూడు రకాల తత్వవాదనలను సరిగా అవగాహన చేసుకోవడం. నేను ఇదే నమ్ముతాను అని భీష్మిన్చుకోవడం అసూయ హేతువు నేను అన్నీ అర్ధం చేసుకొని నాకు సరి అని తోచినదానిని, నా గురువుల ద్వారా గ్రహించిన దానిని నమ్ముతాను అని అనడం అసూయ లేకపోవడం.

కేవలం పై పై అవగాహన సాధనకు ఏమాత్రం తోడ్పడదు, పైగా వితండ వాదనకు హేతువు ఔతుంది. వేద ప్రమాణం ఏదో తెలుసుకొని దానిని ఆచరించడం అసలైన సాధన.  ఇలా సాధన కొనసాగించే అవకాశం ఈ కాలంలో సాధకులకు కలగడం ముఖ్యం గా అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సింధ్దాన్తాల వలననే సాధ్యం కనుక సాధకులు ఈ ముగ్గురు ఆచార్యులకు ఎంతో రుణపడి ఉన్నారు.