ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శార్వాణీ! భువనేశ్వరీ!

Like-o-Meter
[Total: 0 Average: 0]

శార్వాణీ! భువనేశ్వరీ! పరమేశు హృద్వాసినీ

మణి మరకతాభరణ ధారిణీ! కైలాసవాసిని!

మాణిక్యవీణా సంగీతలోలినీ!     ||శార్వాణీ! భువనేశ్వరీ!||

 

కొండపై కొలువున్న అపరంజి బొమ్మ

నిఖిల లోకమ్ములకు, అమ్మ తానే ఆయె!       

చిత్కళగ నెలకొన్న చిత్రమ్ము నీవెగా/ ఆమెగా!  

తలచినంతనె తల్లి ఆప్యాయతల నెలవు   ||శార్వాణీ! భువనేశ్వరీ!||

 

హిమవంతపుత్రీ! శైజా! శ్రీగౌరి!    

అభయదాయిని దేవి;అన్నపూర్ణేశ్వరీ!

శబ్దమును దాల్చిన గాయత్రి నీవెగా!  

అనుకున్నదే తడవు అనురాగాల కొలువు  ||శార్వాణీ! భువనేశ్వరీ!||  

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>