ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అమెరికా పౌర ఆరోగ్య వ్యవస్థలో మార్పులు – ఒక తులనాత్మక పరిశీలన

Like-o-Meter
[Total: 0 Average: 0]

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>
అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఎన్నో ఏళ్ల మోసపూరిత ఆరోగ్య బీమా వ్యవస్థకు ఒక చిన్న కుదుపు ఇచ్చింది. ఈ ఆరోగ్య బీమా వ్యవస్థ ఇక్కడ మన దేశం లో వేళ్ళూనుకొంటున్న తరుణంలో ఈ పరిశీలన అవసరమని భావించి చేసిన చిన్న ప్రయత్నం.
 
1. 26  ఏళ్ళు వచ్చే వరకూ అమెరికా యువత ఇకపై వారి తల్లిదండ్రుల ఆరోగ్య బీమా నీడలో ఉండవచ్చు. ఇది అమెరికా ఎంచుకున్న కుటుంబ వ్యవస్థకు ఒక పాఠం.  వ్యక్తి స్వేచ్చ అనే పేరుతొ కుటుంబ విలువలు కాలరాసే విధంగా సభ్య సమాజం ఉండకూడదని చెప్పక చెబుతుంది. 18 ఏళ్లకే జీవితంలో ఒక మధ్యవయస్కుడితో సమానంగా అనుభవాన్ని సంపాదించే యువతకు 26  ఏళ్ల వరకూ తమ ఆరోగ్యాన్ని తాము చూసుకొనే విషయంలో అనుభవం ఉండదనా దీని సారాంశం?
 
2. ఒక వ్యక్తీ తన జీవిత కాలంలో ఎంత బీమాను పొందవచ్చు అనే విషయంపై బీమా కంపనీ తన విచక్షతను ఇకపై వినియోగించదు. బీమా సౌకర్యం పొందిన ప్రతి వ్యక్తీ రోగిష్టిగా మారి, వైద్యాలను పొందుతూ కాలం చేస్తాడు అనే భావన లేక దొంగ క్లైములు పెట్టి దండిగా డబ్బు సంపాదించే అవకాశం కల్పించడానికా? ఇది మంచికా చెడుకా? లేదా పారదర్శకమైన వైద్య విధానం అమెరికాలో ఉన్నది కనుక ఈ వెసులుబాటు కల్పించవచ్చా? మనదేశం లోని పాలకులు ఇతర దేశాలను ఎక్కువగా అనుగమిస్తారు కనుక ఇది ఇక్కడా ప్రవేశ పెడితే భ్రష్టాచారానికి తలుపులు తెరచినట్లే!!
 
3. ఒక వ్యక్రి రోగగ్రస్తుడైతే, అతని బీమాను రద్దు చేయడమనే పద్ధతికి బీమా సంస్థలు స్వస్తి పలకాలి అంటే ఇంత అమానుషంగా ఉంటాయా బీమా సంస్థలు అమెరికాలో !!
 
మన భారత దేశంలో ఆరోగ్య బీమా వ్యవస్థ గత 10 సం. లు గా బాగా వేళ్ళూనుకొంటోంది.  ఒక రోగి cashless transaction approval పొంది ఉంటే మన వైద్యశాలలు ఎంతగా దండుకుంటాయో మనందరికీ అనుభవమే.  ఇలాటి తరుణంలో అమెరికాలో జరుగుతున్న ఈ మార్పులు మన బీమా సంస్థలు, వైద్యశాలలు గమనించకపోవు. కాని మనం ఎన్నుకున్న మన పాలకులు మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా స్పందించరనే విషయం మనకు విదితమే. 
 
కాని కాలం బహు బలమైనది ఎక్కడో జరిగిన మార్పులు ఒకప్పుడు చాల ఆలస్యంగా ప్రపంచంలో ఇతర ప్రాతాలకు తెలిసేవి.  కాని ఇప్పుడు Thanks to Information Technology తత్క్షణమే ప్రపంచమంతా తెలిసిపోతున్నాయి. 
 
ఈ క్రింది తెలిపిన నిర్ణయాలు మన భారత బీమా సంస్థలు కూడా అవలంబిస్తే మన ఆరోగ్య బీమా వ్యవస్థ చాల వరకు బాగు పడుతుంది. ఇది మన పాలకులు గమనించి మన ఆరోగ్య బీమా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిడిద్దగలిగితే  అమెరికా కంటే మెరుగైన మానవతా విలువలు ఉన్న వ్యవస్థను మనం నెలకొల్పగలం అని ప్రపంచానికి ఋజువు చేయగలం.