Like-o-Meter
[Total: 0 Average: 0]
కాటుకను తయారు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవి అన్నీ కొంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ మూల సూత్రం ఒకటే! కళ్ళకు మేలు చేసే దినుసులతో మసిని తయారు చేయడమే ఆయా విధానాలకు మౌలికమైన పునాది అన్న మాట. ఈసారి ఒక పద్ధతిని గమనించుదాము.
కావాల్సిన సరంజామా:
- పెద్ద చెంచాడు ఉల్లిపాయ రసం
- మంచి తేనె
- పచ్చ కర్పూరం
తయారు చేసే పద్ధతి:
- చిటికెడు ఉల్లిరసాన్ని తీసుకోవాలి.
- దానిలో రవ్వంత తేనె ని కలపాలి.
- చిటికెడు పచ్చ కర్పూరాన్ని అందులో రంగరించాలి.
- ఈ మిశ్రమంతో మసిని తయారించి, నెయ్యి వేసి నూరి, కాటుక లేపనాన్ని చేసుకో వచ్చును.
ఈ మూస పద్ధతిలో మసిని జమ చేయకుండా అలాగే, కంటిలో”అంజనము”లాగా వేసుకోవచ్చును.
&&&&
గమనిక:
ఐతే, ఆధునిక కాలంలో ఐలైనర్లు మున్నగు వాని వాడకము ఉన్నది. అందుకని, ఇలాంటి ప్రాచీన సాంప్రదాయక పద్ధతులు మన కంటికి సరిపడుతాయా? అనే అంశాన్ని దృష్టిలోఉంచుకుని ముందుకు సాగటం మంచిదని నా మనవి.
*****