“స్త్రీ విజయ – విజయనగర మహిళాశక్తి” అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేక తెలుగు డాక్యుమెంటరీ:
ఆమె…ఓ ఆడపులిలా పొంచివుంది…
తన తండ్రి మాది గౌడ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి…
మాదిగౌడ ఒక వస్తాదు. ఒక కుస్తీపోటీలో ప్రత్యర్థులు అతన్ని చంపేసారు. తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కూతురు ఎదురుచూస్తోంది
ఆమె పేరు హరియక్క.
అయితే, హరియక్క తన నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకోలేకపోయింది. తండ్రి హంతకులతో జరిగిన పోరాటంలో తన ప్రాణాలను బలియిచ్చింది.
హరియక్క చిన్నాన్న అయిన చన్నప్ప చనిపోయిన తండ్రికూతుర్ల జ్ఞాపకార్థంగా రెండు వీరగల్లులను నాటాడు.
హరియక్క పుట్టుకతో స్త్రీ కానీ ఆమె తర్ఫీదు పొందిన వస్తాదు. ఆమె మన కాలం నాటిది కాదు. పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేదనుకునే పదహైదవ శతాబ్దానికి చెందింది.
హరియక్క ఓ విశిష్ట స్త్రీ … ఆమె విజయనగర స్త్రీ.
*******
హరియక్క 1446వ సంవత్సరంలో చనిపోయింది. ఆమె మరణం గురించి చెప్పే వీరగల్లు తప్ప ఇతర వివరాలు దొరకలేదు. ఏమైనా హరియక్క ఒక ప్రత్యేకమైన వ్యక్తి. స్త్రీలపై ఎన్నో ఆంక్షలు ఉండేవనుకునే 15వ శతాబ్దంలోనే స్త్రీలు నేర్చుకోని కుస్తీ విద్యలో ఆరితేరింది. ఆవిధంగా ఆ కాలంలో స్త్రీలందరూ ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాలేదన్న వాస్తవాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. ఆనాటి సమాజంలో ఒకేఒక్క హరియక్క ఉండొచ్చు అనుకోవడం సరికాదు. ఆమెలాంటి ఎందరో స్త్రీలు విశాలమైన విజయనగర సామ్రాజ్యం నలుమూలలా ఉండివుండవచ్చు…అజ్ఞాతంగానో…ఆదరణ లేకుండానో!
*******
మా ఈ స్త్రీ విజయ లో కనిపించిన మహిళా పాలకులు, వీరులు, కవయిత్రులు మాత్రమే కాదు. ఇంకా ఎందరో స్త్రీమూర్తులు ఆకాలంలో అనేక రంగాల్లో రాణించారు. వీరిలో చాలామందికి చెందిన శాసనాలు, వీరగల్లులు, సాహిత్యం వంటి ఆధారాలు కాలక్రమంలో పోగొట్టుకుపోయాయి. కానీ మనకు దక్కిన ఆధారాల వల్ల విజయనగర సామ్రాజ్యం అనే స్వర్ణయుగాన్ని నిర్మించడంలో స్త్రీలు ప్రధాన పాత్రను పోషించారని స్పష్టంగా తెలుసుకోవచ్చు.
*******
Stree Vijaya – Women of Vijanagara Women’s Day special documentary English version: