ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటారు కొమ్మ – చిట్టి పిట్ట

Like-o-Meter
[Total: 1 Average: 4]

 

మంద్ర మైన గాలి చాలు

రెక్కలిప్పి ఎగురు చూడు

పదిగ్రాముల బరువుతూగు

పలువన్నెల పక్షి అది

చిటారుకొమ్మే దాని నివాసం

గాలి భక్షణం నిరంతర వీక్షణం

నేలంటే ఛీ కొట్టి

నింగిలో పల్టీలు కొట్టి

తనలోతాను రమించు

తమాషైన పక్షి ఒకించు

గాలికి చిటారు కొమ్మ నాట్యం

అది ఈ చిట్టి పిట్ట భాగ్యం

ఆనందం అంతును కనుగొన్న చోద్యం

చూస్తూఉంటే వ్రాయోచ్చు ఒక కావ్యం

@@@@@

Subscribe to Anveshi – An Explorer’s Channel