Like-o-Meter
[Total: 0 Average: 0]
ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
మేఘాలకు ఆర్ద్రత్వం ఇస్తుంది.
నింగిలోని హరివిల్లులకు
“మీకున్నవి ఏడేగా!
అదనపు రంగులను బహూకరిస్తాము
అలంకరించుకోవడాన్ని నేర్పిస్తాము”
ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
నీలి గొడుగు నింగికి
విస్తారంగా విప్పార్చుకొనేలా చేస్తాము
ఇంత చిన్న వస్తువు; అరచేతిలో ఇమిడిపోయి;
చందమామను-
నిత్య పున్నమిగా ఉంచుతాము
ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
గ్రహ గోళాల చలనాలను-
మానవాళి శాంతంగా మనుగడ సాగించేలా చేస్తాము;
అనంత విశ్వపు కొలతల దృశ్యాలను
మన కన్నులలో నిలిపి ఉంచి;
విజ్ఞానపు కేతనమై రెప రెపలాడేస్తూ;
ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
ఈ రిమోట్ కంట్రోలర్!