Like-o-Meter
[Total: 0 Average: 0]
వాన వానా వల్లప్ప
వల్లప్పకు ఆహాహా!
దొరికినవీ కానుకలు
కోకొల్లల వేడుకలు! ||
తిరిగి తిరుగు ఆటలు
తిరుగు తిరుగు ఆటలు
తారంగం పాటలు!
జలతరంగిణీ ఆటలు ॥
‘వాన చుక్క టప్పు టప్పు!
తడవకండి, తప్పు తప్పు
పడిసెం, జలుబులు కలుగును
తడవకండి, తప్పు తప్పు’
తప్పంటే ఆగేరా
ఈ అల్లరి పిల్లలు!?
ఆనక ఆ పెద్దలే
అవుతారు పిల్లలుగా
వాన వానా వల్లప్ప
వల్లప్పకు ఆహాహా
దొరికినవీ కానుకలు
కోకొల్లల వేడుకలు ||
*****