1) దేవతలకు గురువు- “బృహస్పతి “
2) రాక్షస గురువు:- “శుక్రాచార్యుడు”.
3) శుక్రాచార్యుల శిష్యరికము పొందిన వాడు – కచుడు
4) భక్త ప్రహ్లాదుని ఉపాధ్యాయులు – చండామార్కులు, (చండ, మార్క/అమరక= రాక్షస గురు శుక్రాచార్యుని కుమారులు)
**********
1) మహాకవి వాల్మీకిగా- (నిషాదుడు రత్నాకరుడిని) మార్చిన మంత్రము ఏది?
సమాధానము: శ్రీరామ తారక మంత్రము
2) శ్రీరామచంద్రులకు భక్తితో తాను రుచి చూస్తూ, ఎంగిలి పళ్ళు ఇచ్చినది శబరి- ఎంగిలి ఫలములను ఇచ్చినప్పటికీ, భక్తితాదాత్మ్యతలకు పరాకాష్ఠగా – నిలిచినది ఆమె. ఆ శబరి యొక్క గురువు ఎవరు?
సమాధానము: మతంగ మహాముని.
3) శ్రీకృష్ణుడు, సుధాముడు (కుచేలుడు) గురువు పేరు ఏమిటి?
సమాధానము: సాందీపనీ ముని
4) ద్రోణుడు, ద్రుపదుడు గురువు ఎవరు?
సమాధానము: అగ్నివేశుడు
5) భీష్ముడు- బాలకులైన పాండవులకు, కౌరవులకు విద్యాబోధనకై ఎవరిని ఆహ్వానించాడు?
సమాధానము: ద్రోణుని.
********
6) “జగద్గురువు” అని ప్రఖ్యాతి గాంచిన వారెవరు?
సమాధానము: ఆదిశంకరాచార్య
7) ఆయన గురువు ఎవరు?
సమాధానము: గోవింద భగవత్పాదులు
(ఇక్కడ చిత్రమేమిటంటే – ఈయన వేంకటేశుని “గోవింద” నామధారి, అవగా శంకరాచార్యులు శివ నామధారుడు.)
8) ఆదిశంకరాచార్యుల శిష్యులలో ఒకరు:- ఫద్మపాదుడు; వీరిరువురి బంధము – “గురు శిష్య పరంపర” కు నిదర్శనము.
9) శ్రీ రాఘవేంద్ర స్వామి (వేంకట నాధుడు- పూర్వ నామమ) గురువు
సమాధానము: సుధీంద్ర తీర్ధులు
10) శ్రీ రామనుజాచార్యుల శిష్యులు:-
సమాధానము: వరదాచార్యులు, యజ్ఞేశులు; తీర్ధ
********
1) శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానములోని “భువనవిజయము”. అందులో అష్టదిగ్గజములు ఉండేవారు. ఆ కవివరులలో ఒకడు “నంది తిమ్మన”. ఈయనే “ముక్కు తిమ్మన”, ఈయన యొక్క గురువు “అఘోరశివ”.
2) అయ్యలరాజు రామభద్రుని గురువు:- “ముమ్మిడి వరదాచార్యులు
3) వరాహమిహురుని గురువు
సమాధానము: తండ్రి ఆదిత్యదాసు
4) ఛత్రపతి శివాజీ గురువు
సమాధానము: సమర్ధ రామదాసు
5) శ్రీరామదాసు (కంచర్ల గోపన్న – అసలు పేరు) కు తారకమంత్రమును బోధించిన మహా వ్యక్తి ఎవరు?
సమాధానము: భక్త కబీరు దాసు
7) వివేకానందుడు (గదాధరుడు- తొలి పేరు) గురువు ఎవరు?
సమాధానము: శ్రీరామకృష్ణపరమహంస
*********