“మొండిఘటం” అనుకున్న “మొనగాడు”, “రుస్తుం” లా రప్ఫాడిస్తానన్న “గాంగ్ లీడర్” కాంగ్రెస్ “తాతయ్యల ప్రేమలీల”లలో అల్లాడిపోతూ “ఆలయశిఖరం” ఎక్కి “న్యాయం కావాలి” అని గొంతు చించుకున్నా ఉపయోగం లేకపోయింది. “పసివాడి ప్రాణం” ఏ చిలకలో ఉందో కాంగ్రెస్ మాంత్రికులకే తెలుసు మరి.
“ఊరికిచ్చిన మాట” మరచి కాంగ్రెస్ తో పెళ్ళికి “శుభలేఖ”లు వేయిస్తే “ఇది పెళ్ళాంటారా” అని నిలదీసిన ప్రజలను “మహానగరంలో మాయగాడు”గా మోసపుచ్చిన “చిరంజీవి”కి చెవిలో పువ్వెట్టి “బై చిరంజీవ” అనేసింది హస్తం పార్టీ చివరికి.
మంత్రి గారు కాకపోయినా, “మంత్రిగారి వియ్యంకుడు” అయినా కాగలడా మన “చంటబ్బాయ్”?