ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

కమ్యూనిజం, సోషలిజం వగైరాలు కొత్త సిద్ధాంతాలా?

Like-o-Meter
[Total: 0 Average: 0]

మొన్నీ మధ్య ఒక  హెచ్ ఆర్ చర్చా వేదిక (అంతర్జాల ఆధారిత) లో ఓ వ్యాసాన్ని చదివాను. అందులో ఈ కింద చూపుతున్న చిత్రాన్ని వాడారు.


ఆ వ్యాసాన్ని చదివాక ఇలా అనిపించింది…

ఆర్ధిక నిపుణుడైన  కార్ల్ మార్క్స్ కే  ఇంత దార్శనికత  ఉంటే మన ఋషులకు ఎంత ఉండి ఉంటుంది? వాళ్ళు దర్శించి, శిష్యులకు అందచేసిన   విజ్ఞానం కలి ప్రభావం వల్ల వక్ర భాష్యాల,  ప్రక్షిప్తాల మరుగున పడి ఎవరో ఎప్పుడో మహాత్ములు బయటకు వచ్చి వివరిస్తుంటే విస్తుపోతున్నాము మనము. 

మన స్థితి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసి ఇంట్లోనో బ్యాంకు లాకరు లోనో దాచి అక్షయమైన బంగారాన్ని పొందిన అనుభూతుని అనుభవించే స్థాయిలో ఉంది. పెరుగుట విరుగుట కొరకే అనే నానుడి సర్వకాల సర్వావస్థలలోనూ వాస్తవం.  ఇప్పుడు పర్యావరణం పై పెరుగుతున్న ప్రేమ, సహజ ఉత్పత్తుల వినియోగం పై మోజు, అలాగే సమాజంలో పెరుగుచున్న భ్రష్టాచారం, వైదికత పట్ల ఆశక్తి మొ. నవి సమాజ పరిణామ క్రమంలో భాగాలే.  

అసలైన కమ్యునిజం “వసుధైవ కుటుంబం” అనే  వేదోక్తి నుంచి వచ్చినదే.  సహజమైన (ఆరోగ్యకరమైన వస్తు, సేవల ఉత్పత్తి ద్వారా కలిగిన) సంపద  అవసరమే ఆధారమైన తారతమ్యమేరుగని సంపద పంపిణీ వ్యవస్థ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసి భావి పరిణామాలు అనడంలో మనం సందేహపడవలసిన అవసరం లేదు. అలాగే విజ్ఞానం వికసించి ప్రజలకు అందుబాటులోకి వచ్చినపుడు దానితో పాటు వెర్రితలలు వేసిన అవినీతి కూడా ఆ విశిష్టమైన విజ్ఞానాన్ని వినియోగించుకుంటుంది.  ఇక్కడే మానవ జాతి నైతికత పరీక్షకు గురౌతుంది.

ప్రాచీనులు ప్రవచించిన జీవన విధానాన్ని ఒకసారి సరిగ్గా పరిశీలించి చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు దొరికాయి నాకు. అవేవంటే

  • అనవసరపు కోర్కెల్ని అదుపులో పెట్టుకోవడం.
  • అక్రమంగా డబ్బు సంపాదించకుండా ఉండడం.
  • Investment కంటే Divestment కే ప్రాధాన్యతను ఇవ్వడం
  • ఉన్నదాంట్లో కొంతభాగాన్ని ఇతరులకు పంచడం.
  • నియమబధ్ధమైన జీవిన విధానాన్ని కలిగివుండడం.
  • నోటితో చెప్పడమే కాకుండా ఆచరించి చూపడం.
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం.

కమ్యూనిజం, సోషియలిజం, డెమోక్రసీ మొదలైనవి పాశ్చాత్యులకు కొత్త సిద్ధాంలేమో కానీ భారతదేశంలో అవి ఎప్పటి నుండో ఉండేవని నా అభిప్రాయం. పుస్తకాల్లోను, పెద్దల మాటల్లోనూ ఉండే మంచి విషయాల్ని ఆచరించలేకపోవడం వాళ్ళ తప్పు కాదు.

పైవాటిల్లో ఆధునికులు పెదవి విరిచే సో కాల్డ్ “మూఢనమ్మకం” ఏదో అర్థం కాలేదు! ఏమైనా, మన మూలాల్ని మరోసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలావుంది.

Better late than never.

శుభం …