ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మా ఇంట్లో గోకులాష్టమి

Like-o-Meter
[Total: 0 Average: 0]

శ్రావణ మాస బహుళ అష్టమిని శ్రీకృష్ణుని అవతార దినంగా జరుపుకోవడం సనాతన సంప్రదాయం.”కలౌ కృష్ణం సాంగోపాంగం” అన్న ఆర్షవాక్కు మేరకు కృష్ణనామస్మరణ, పూజ మొదలైనవి కలియుగంలో అత్యవశ్యకం.

నారాయణుడు ధరించిన దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహాలను దేవతలు పూజిస్తారు. నరసింహుని ఉపాసన అందిరికీ సాధ్యం కానిది, చాలా కఠినమైనది. బుద్ధ, కల్కి రూపాలకు పూజలు లేవు. మిగిలిన రెండు అవతారాలు, అంటే, రాముడు-కృష్ణుడు మాత్రమే అందరి చేతా పూజింపబడగలవైనవి. అందులోనూ కృష్ణావతారం కలియుగానికి అత్యంత సమీపమైన కాలానికి (ద్వాపరయుగానికి) చెందినది.

స్థలానుసారంగా, ప్రాంతాలవారీగా కృష్ణాష్టమిని అనేక విధాలుగా జరుపుకుంటారు. కన్నడ బ్రాహ్మణ సంప్రదాయంలో ఆరోజున “గోకులం”ను చేసి పూజించే విధానం ఉంది. ఈ “గోకులం”లో పసిపాపల రూపంలో ఉండే బలరామ-కృష్ణులు, వసుదేవుడు-దేవకి, నందుడు-యశోద, కృష్ణునికి నామకరణం చేసిన గర్గాచార్యులు, బాలకృష్ణుణ్ణి చంపడానికి మొట్టమొదటగా వచ్చిన పూతన, కంసుని బందీఖానా కాపలాదారుడు మొదలైన ప్రతిమల్ని చందనంతో గానీ లేక ఎర్రమట్టితో గానీ చేసి ఉంచుతారు. బలరామ-కృష్ణుల్ని శాస్త్రోక్తంగా పూజించుతారు. అలా నిన్న మా ఇంట్లో చేసిన “గోకులం” యొక్క కొన్ని ఛాయాచిత్రాలు…పాఠకుల కోసం.