ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆలయనిర్మాణం, విగ్రహారాధన వేదవిరుద్ధమా?

Like-o-Meter
[Total: 1 Average: 5]

 

నిన్న గాక మొన్న కన్ను తెరిచిన ప్రతి బొడ్డూడని పసికూనకీ “వేదాల్లో అది లేదు వేదాల్లో ఇది లేదు, ఉంటే చూపించు!” అని నిలదియ్యటం అలవాటైపోయింది. ఎక్కడ బడితే అక్కడ “వేదాలలో మూర్తి పూజ గురించి దేవాలయాల గురించి అసలు ప్రస్తావన ఉందా?” అని నిలదీస్తున్న వాళ్ళకి వేదంతో ప్రత్యక్ష సంబంధం ఉందా? ఎవరైనా దేని గురించైనా మాట్లాడవచ్చు, కానీ పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడాలి కదా!

అలా వాదించేవాళ్ళకి వేదం గురించిన ప్రత్యక్ష జ్ఞానం లేదని నేను బల్లగుద్ది చెప్పగలను . అలాంటివాళ్ళు తరచు ఉటంకిస్తున్న యజుర్వేదపు ఇంగ్లీషు అనువాదం కూడా హిందూద్వేషులు చేసిన తప్పుడు అనువాదం!

నాకూ వేదం గురించిన ప్రత్యక్ష జ్ఞానం లేదు, కానీ ఎక్కడ వెతికితే అధికారికమైన సమాచారం దొరుకుతుందో తెలుసుకోగలను. పైన ఎదటివాళ్ళని నోరు మూయించటానికి పనికొచ్చే ముక్కల్ని మాత్రం ఎత్తి రాయడం కాకుండా పూర్వాపరాలు చూడటం, నాకు దొరికినది సత్యమా కాదా అని పాఠాంతరాలతో సరిపోల్చి చూడటం లాంటివి కూడా నాకు తెలుసు. వేదసాహిత్యం గురించి నాకు చాలా తెలుసు – అసలు నాకు తెలియని దాన్ని గురించి రాసి అభాసుపాలయ్యే మనిషిని కాను నేను.

ఈ హేతువాద, నాస్తికవాద, హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులకే కాదు, హిందువుల్లోనే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వేదంలో లేని విషయాన్ని వేదవ్యాసుల వారు గానీ శంకరాచార్యుల వారు గానీ రామానుజుల వారు గానీ పాటించరు గాక పాటించరు. అసలు క్రైస్తవులకి బాప్తిజం లాగ ముస్లిములకి దావత్ లాగ ప్రవేశ నిర్గమ విధి హిందువులకి లేదు. కానీ వేదం పరమ ప్రమాణం అని అంగీకరించాలి! వేదంలో ఏది ఉంది ఏది లేదు అని చెప్పటానికి కూడా సంస్కృతం క్షుణ్ణంగా నేర్వాలి. ఆ పైన నిరుక్తం తెలియాలి (పాణినీయం వేదం దగ్గిర పనిచెయ్యదు, వేదంలో ఉన్న శాస్త్రాలలోని ఒక భాగమైన నిరుక్తం ప్రకారమే నాలుగు వేదాలకి అర్ధం చెప్పాలి – ఇది చాలా ముఖ్యమైన విషయం.ఇంతకన్న ముఖ్యమైన విషయం ఏ ఒక్క వేదమంత్రానికీ పాఠాంతరాలు ఉండవు, అంటే వెర్షన్లు ఉండవు.సూటిగా చెప్పాలంటే నీకలా అర్ధమైతే నాకిలా అర్ధమైంది అని కూడా అనరాదు). వేదపఠనం కూడా తెలియాలి. ఎందుకంటే వేదమంత్రాల్ని ప్రింటులో ఉన్నది ఉన్నట్టు చదివితే కుదరదు – హ్రస్వాక్షరాన్ని దీర్ఘాక్షరం కింద చదివినా దీర్ఘాక్షరాన్ని హ్రస్వాక్షరం కింద చదివినా అర్ధంలో చాలా తేడా వస్తుంది. ఇంతకీ ఈ హేతువాద-నాస్తికవాద-హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులు ఎత్తి చూపించిన నాలుగు ముక్కలేనా వేదం అంటే! ఇంకేమీ లేదా?

Buy Elements of Indian Art: Including Temple Architecture, Iconography and Iconometry
“గోఘ్న” అనే మాట చదవగానే ఆవుని చంపినవాడు అనే అర్ధం అనుకుంటారు, కానీ ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు అని కూడా ఆ పదానికి అర్ధం వస్తుంది – గోహత్యను గురించి చెప్పేటప్పుడు నిందార్ధకంలో వాడిన ఈ పదాన్నే కొందరు ఋషుల్ని ప్రశంసించేటప్పుడు కూడా వాడారు! గోహత్య మహాపాపం అని చెప్పిన వేదమే ఆవుని చంపిన ఋషుల్ని ఎందుకు పొగుడుతుంది? అక్కడ “గో/గౌ” అనే ధాతువుకి ఉన్న ఇంద్రియాలు అనే రూపాన్ని తీసుకున్నారని అర్ధం కావాలంటే ఆ ’గో’ అనే ధాతువుకి ఉన్న అన్ని రూపాలను గురించీ తెలిసి ఉండాలి. ఇవేవీ తెలియని హేతువాద-నాస్తికవాద-హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులు వేదం గురించి తమకే అంతా తెలుసుననీ మనకే ఏమీ తెలియదని ఎందుకు అనుకుంటున్నారు?

“The problem is that in Hinduism the scriptures are many and varied and all of them at many times contradict with each other..So, one can’t get the “whole” idea by reading just one of those many scriptures.. And even if one studies all of them chances are that still he will remain confused..The scriptures are not that easy to decipher at all.” అని  Rickross అనే విదేశీయుడికి తెలిసినమాత్రం కూడా హేతువాద-నాస్తికవాద-హైందవేతర భారతీయులకి తెలియటం లేదు – ఏమిటీ దౌర్భాగ్యం?

All of them at many times contradict with each other అన్నాడు కదా అని అతను వేదాలను అవమానిస్తున్నట్టు కాదు, అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా కొట్టుకొచ్చి ఒక్కచోట చేరిస్తే వేదం గురించే కాదు సుత్తి గురించి సుత్తేసినా కనపడేది అలానే ఉంటుంది. హేతువాద-నాస్తికవాద-హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులకే కాదు మరి కొందరికి కూడా వేదం మూర్తిపూజను సమర్ధించినట్టు అనిపించకపోవటానికి కారణం వేదం ఏదీ మట్టిబుర్రలకి కూడా అర్ధం అయ్యే స్థాయిలో విస్తరించి చెప్పదు. చాలా సంక్షిప్తంగా బీజ రూపంలో చెబుతుంది. అదీ గాక వ్యాసుడు విభజించకముందు ఈ ఋగ్వేదం,యజుర్వేదం అనేవి కూడా లేవు – మనలాంటి మట్టిబుర్రలు తక్షణం కావలసిన దానికోసం అప్పుడున్న ఏకైక వేదం మొత్తాన్ని వెతకడం కష్టం గనక విభజించడం వల్లనే ఈ హేతువాద-నాస్తికవాద-హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులకి ఆ నాలుగు ముక్కలూ దొరికాయి. వ్యాసుడు విభజించడానికి పెట్టుకున్న ప్రాతిపదిక ఏమిటో మనకి తెలియదు గానీ ఇప్పటికీ ఒక విషయం గురించిన సమస్తమూ ఒకే చోట లేదు – ఉదాహరణకి వివాహ క్రతువుకి సంబంధించిన మంత్రాలు ఇప్పటికీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉన్నదాన్ని పురోహితులు ఒక చోటికి చేర్చి వాడుకుంటున్నారు. వేదం యొక్క పరిమాణమూ, వ్యాకరణమూ, ఆవరణమూ, నిర్మాణాలు ఇలా ఉంటే ఈ హేతువాద-నాస్తికవాద-హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులు మూర్తిపూజ గురించి చెప్తున్న అబద్ధాలతో పాటు అసలు ఆగమం కూడా వేదం లోనిది కాదని మరో  బాంబు పేలుస్తున్నారు! వేదంలో లేనివాట్ని శంకరాచార్యుడు చెప్తాడా?

వేదం మూర్తిపూజని సమర్ధించలేదా – హవ్వ!

Buy Hindu Architecture : Vastu & Silpa Sastra
 

“ద్వే వావ బ్రహ్మనో రూపే, మూర్తం చైవామూర్తం చ”

dve vāva brahmaṇo rūpe, mūrtaṃ caivāmūrtaṃ ca

(బృహదారణ్యకోపనిషత్తు – 2.3.1)

– God (Brahman) has two modes, formless (niraakaara, asambhuta) as well as form (saakaara, sambhuta).

హేతువాద-నాస్తికవాద-హైందవేతర మహనీయ గుణ మార్తాండతేజులు యజుర్వేదం 32 అంటున్నది “న తస్య ప్రతిమా అస్తి” – దాని గురించి ఒక చిన్న సంగతి చెప్తే సరిపోతుంది. అక్కడ సరైన అనువాదం చూస్తే ఆ ఒక్క ప్రతిమలో మాత్రమే నేను లేను, విశ్వంలోని ప్రతి వస్తువులోనూ ఉన్నాను అనే అర్ధం. దానికి హిందూద్వేషులు “చూశారా! దేవుడు తనే ప్రతిమలో ఉండనని చెప్తున్నాడు!” అని హడావిడి చేస్తున్నారు – ఇసక తక్కెడ పేడ తక్కెడ, అంతే! ప్రస్తుతం యజుర్వేదం 40.9 గురించి కొంత విస్తరించి చెబుతాను. ఇక్కడ ఒక తమాషా కనిపిస్తుంది, కొంచెం శ్రద్ధ చూపించండి! ఈ 40వ అధ్యాయాన్ని వాజసనేయ సంహిత అనీ శుక్ల యజుర్వేదం అనీ రెండు పేర్లతో పిలుస్తారు. దీనినే ఈశోపనిషత్ అని కూడా అంటారు – ఈశావాస్యోపనిషత్తు కాదండోయ్, అది వేరు!

अन्धं तमः प्रविशन्ति ये ऽसम्भूतिम् उपासते

ततो भूय इव ते तमो य उ सम्भूत्याम् रताः

andhaṁ tamaḥ praviśanti ye ‘sambhūtim upāsate

tato bhūya iva te tamo ya u sambhūtyām ratāḥ

(Madhandiya recension)

अन्धं तमः प्रविशन्ति ये ऽविद्याम् उपासते

ततो भूय इव ते तमो य उ विद्यायाम् रताः

andhaṁ tamaḥ praviśanti ye ‘vidyām upāsate

tato bhūya iva te tamo ya u vidyāyām ratāḥ

(Kanva recension)

మొదట విద్య-అవిద్య గురించిన మంత్రానికి అర్ధం చూస్తే ఇలా ఉంటుంది:

“They who worship Avidya alone fall into blind darkness ; and they who worship Vidya alone fall into even greater darkness.” ఇందులో ఉన్న కిరికిరి ఏమిటో చూశారుగా – “అవిద్య”ను మాత్రమే ఉపాసిస్తే మామూలు చీకటి అయితే “విద్య”ను మాత్రమే ఉపాసిస్తే గాఢమైన చీకటి అవుతుందట! ఇక్కడ అవిద్య అంటే వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం లాంటి లౌకిక విద్యలు, విద్య అంటే దైవం గురించి చెప్పే బ్రహ్మవిద్య అని అర్ధం చేసుకోవాలి.

ఇప్పుడు అసంభూతి-సంభూతి గురించిన మంత్రానికి అర్ధం చూస్తే ఇలా ఉంటుంది:

“Into blinding darkness pass they who are devoted to the unmanifest, and into still greater darkness, as it were, they who delight in the manifest.” – ఇక్కడా అదే కిరికిరి ఉన్నది చూశారుగా – “అసంభూతి”ని మాత్రమే ఉపాసిస్తే మామూలు చీకటి అయితే “సంభూతి”ని మాత్రమే ఉపాసిస్తే గాఢమైన చీకటి అవుతుందట.

అంటే, “అవిద్య-విద్య” అనేవాట్ని గానీ “అసంభూతి-సంభూతి” అనే వాట్ని గానీ విడదియ్యటమే అసలైన దోషం! అనగా హేతువాద-నాస్తికవాద-హైందవేతర భారతీయుల అహంకారాన్ని బద్దలు కొడుతూ చేసే ప్రతి కర్మనీ భగవదర్పితం చేస్తూ “అవిద్య-విద్య” అనేవాటిని విడదియ్యకుండా కలిపి ఉపాసించమనీ  అర్చామూర్తిలో సృష్టికర్తయైన ఈశ్వరుణ్ణి చూడటం సాధన చేసి క్రమేణా ఇతరమైన వాటిలో కూడా చూడటం నేర్చుకోవడం అనే పద్ధతిని పాటిస్తూ “అసంభూతి-సంభూతి” అనేవాటిని విడదియ్యకుండా కలిపి ఉపాసించమనీ వేదం కుందబద్దలు కొట్టి చెబుతున్నది.

ఇది చాలునా? ఇంకనూ కావలెనా!

@@@@@

Subscribe to Anveshi-An Explorer’s Channel to watch exclusive historic videos