ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అడ్డరోడ్డు కబుర్లు – తీవ్రవాదుల దాడి

Like-o-Meter
[Total: 0 Average: 0]

వార్తః ఢిల్లీ హైకోర్టు వద్ద తీవ్రవాదుల బాంబు దాడి

ప్రభుత్వ ప్రణాళిక: ప్రధానమంత్రి కార్యాలయం ఒక కంకణం, రెండు ఉక్కుపాదాల కొనుగోలుకు ఆర్డర్లు సిద్ధం చేసింది. త్వరలోనే మరోసారి కంకణం కట్టుకొని  ఉక్కు పాదాలతో తీవ్రవాదాన్ని ఒక్కసారైనా నొక్కిపారెయ్యాలని ప్రధానిగారు ఉవ్విళ్ళూరుతున్నారు.

ప్రజా నాలుక: ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరుల చేతులన్నీ కంకణాలతో నిండిపోయాయి.  కాళ్ళేమో ఉక్కుపాదాల్తో పొక్కిపోయాయి. ఇహ మిగిలినవి గొంతులే! కొత్త కంకణాన్ని గొంతుకు కట్టుకున్నా, ఇనుప పాదాల్ని ఎక్కడ పెట్టుకొంటారన్నది ప్రధాన(ని) సమస్య.

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>

* * *

ప్రభుత్వ ప్రణాళిక: టెర్రరిస్టు “జీ” చేసిన బాంబుదాడిలో మరణించిన ఓ వ్యక్తి అంతకు అరగంట ముందే తనకు ఫోను చేసాడని, ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలు ఆధారాలతోసహా అవసరమైనప్పుడు అందిస్తానని డిగ్గీరాజా విలేఖరులకు చెప్పారు.

ప్రజా నాలుక:  మంత్రదండమా మజాకా! ఈసారి ఎవడైనా సరే నిరాహారదీక్ష చేసాడో, ఈ ఆధారాలతో మసిపూసేస్తాడు ఈ మారేడుకాయ.

 

* * *

ప్రభుత్వ ప్రణాళిక: ఒక్క శాతం తీవ్రవాదం వల్ల తాను మరోసారి సిగ్గుపడాల్సి వస్తున్నదని రాహుల్ రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో వాపోయారు.

 

ప్రజా నాలుక:“సిగ్గులేకపోతే సరి!”…. అని ఆసుపత్రిలో వెంటపడి వెళ్ళగొట్టారనా ఈ సిగ్గు?

 

* * *

ప్రభుత్వ ప్రణాళిక: అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటం వలనే ఈ దాడి జరిగిందని, తను తన పార్టీ మరణ శిక్షకు వ్యతిరేకమని, అందుకుగాను ఉద్యమిస్తున్న తీవ్రవాదులకు సంఘీభావం ప్రకటిస్తున్నామని ముఫ్తీ మహ్మద్ సయీద్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

ప్రజా నాలుక  అఫ్జల్ గురును ఉరితీస్తే కానీ వదలమని చెబుతూఈ అబ్బని కిడ్నాప్ చేస్తే, ఎలా మొత్తుకుంటాడో!!

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>