ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అమ్మాయిలు – కలలు

Like-o-Meter
[Total: 1 Average: 4]

Appeal to all (girls in particularly) అనబడే ఉపోద్ఘాతం:

కోప్పడకండి!
తిట్టకండి!!
శాపనార్ధాలు పెట్టకండి!!!
అమ్మాయిలూ ఇది నవ్వులాటకి మాత్రమే!!!!

**********

నారీ స్తోత్ర సంగ్రహం అనే అత్యంత పురాతన గ్రంధంలో ఒక శ్లోకం ఉంది.

అగ్నిపుల్లం అగ్రభాగం ప్రళయ ప్రమాద భాజ్యం

ఆడపిల్లం బుద్ధిశక్తిం తత్సమానం న సంశయం!

చాలా సులువైన సంస్కృత శ్లోకం కాబట్టి అందరికీ దీపాలు వెలిగే ఉంటాయి ఈ శ్లోకం తిట్టు ఏమాత్రం కాదని, అలా కనబడే పొగడ్తని ఆ శ్లోకకర్తే చెప్పాడు.

**********

అమ్మాయిలు – కలలు అనేది ఒక తమషా విషయం….అని నేను చెప్పడంలేదు. మిమ్మల్ని చెప్పమనీ అడగడంలేదు. ఐనా ఒకసారి చదివి చూడండి.

ఒకటవ కల

తెల్లటి గుర్రం. పంచకల్యాణి. తెల్లటి నురగలతో పరుగెత్తి వస్తోంది. దానిపై అందమైన రాజకుమారుడు. ఒక చేత్తో కత్తి, మరో చేతిలో డాలు. సన్నటి రహదారిలో పరుగులు పెడుతూ పంచకల్యాణి. పొగడచెట్టు కింద అమ్మాయి. అప్పుడే తల ఎత్తి చూసింది. అమ్మాయి, రాకుమారుడి కళ్ళు కలిసాయి. సవారీ చేస్తూనే అమ్మాయిని ఎత్తుకుని ముందుకెళ్ళిపోయాడు.

చాలా బావుంది. ఒక చేత్తో కత్తి, మరో చేత్తో డాలు పట్టుకున్న వాడు ఏ చేత్తో నిన్నెత్తుకున్నాడు అమ్మణ్ణీ అని అడిగితే “stupid” అని తిట్టింది.

 

రెండవ కల

అదో పెద్ద నృత్యాలయం (ball room). అనేక జంటలు కలిసి నృత్యం చేస్తున్నాయి. అత్యంత సుందారాంగుడైన అబ్బాయి చేతిలో చేయి కలిపి అమోఘంగా నృత్యం చేస్తోంది అమ్మాయి. సంగీతం జోరందుకొంది. నృత్యంలో వేగం పెరిగింది. అబ్బాయి ఆవేశంలో అమ్మాయిని గాల్లోకి ఎగరేసాడు. కల చెదిరింది.

బహుత్ ఖూబ్. గాల్లోకి ఎగరేసిన తర్వాతే ఎందుకు కల కట్టైంది? ఇంకో సుందరాంగి చూసి, నిన్ను గాల్లోనే వదిలేసి ముందుకెళ్ళిపోయుంటాడు అంతేనా? అని అడిగితే “dumb head” అని తిట్టింది.

 

 

మూడవ కల

పెద్ద గుహ. అందులో సింహం ఉంది. నెత్తి మీద కిరీటంతో. అమ్మాయి భయం భయంగా గుహలోకి వచ్చింది. సింహం నోరు తెరిచింది కానీ గర్జించలేదు. అమ్మాయి భయం భయంగా మైసూరుపాకును సింహం నోట్లో పెట్టింది. స్వీటును చప్పరిస్తూ, అమ్మాయి చేయిని ప్రేమగా నాకింది.

ఓహో! సింహం తోక కూడా ఊపిందా? అని అమ్మాయిని అడిగితే “damn dirty goose” అని తిట్టింది.

నాల్గవ కల

పెద్ద కాకరపువ్వొత్తి. కాళ్ళు, చేతులు ఉన్నాయి. చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉంది. అది మాట్లాడినప్పుడల్లా రవ్వలు విరజిమ్ముతున్నాయి. అల్లంత దూరంలో ఒక జలయంత్రం (అంటే fountain అంటే అమ్మాయి). చేతిలో మొబైల్. మాట్లాడుతున్నంత సేపూ నీళ్ళు ఉవ్వెత్తున ఎగురుతోంది. అంతలో కాకరపువ్వొత్తి నేల మీద పడి భూచక్రమై తిరిగి తిరిగి ఆరిపోయింది.

బాబోయ్! మొబైల్ బిల్లు చూసా? లేక నిప్పు ఆరిపోయా? అని అడిగితే “pester” అని తిట్టింది.

**********

కల ఇదని నిజమిదని

తెలియదులే బ్రతుకింతేనులే..ఇంతేనులే

 

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>