ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అర్ధం చేసుకోరూ!!

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎవడు చెప్పడ్రా ప్రజాధనం వృధా ఔతుందని?
ప్రజలకు మరిన్ని మేలైన సేవలందించడానికి వీలౌతుందని
ఎంతో కష్టపడి సంపాదించిన ఎంపీ సీటు కి వన్నె పెరుగుతుందని
ఎం.ఎల్. ఏ. సీటు వదిలి ఎం.పీ సీటు కెళ్ళిన చిరంజీవి
చిరకాలం ఒకటి వదలి మరొకటి పట్టుకొని
హీరోయిన్లను మార్చినట్లు రాజకీయాలలో పార్టీలు పదవులు మార్చోద్దూ

అర్ధం చేసుకోరూ!

రాజ్యసభ సభ్యుడైతే మంత్రి పదవి ఖాయం
మంత్రి గారి వియ్యంకుడు కాడు
మంత్రి గారి అల్లుడు కాడు
మరి తనే మంత్రి  అయితే మజాగా ఉండదూ
అర్ధం చేసుకోరూ!!

మంత్రి పదవి రాకపోతే?
150 వ సినిమా ఉండనే ఉంది కాదా!
పైగా నిర్మాత కూడా ఎవరో కాదు తన  కొడుకే
డబ్బులన్నీ ఒకళ్లకే
అర్ధం చేసుకోరూ!!

అర్ధమైంది మీ గోల
ప్రజారాజ్యం ఎందుకు పెట్టినట్లూ ?
దాన్ని కాంగ్రెస్సులో ఎందుకు కలిపినట్లూ?
తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేమైనట్లూ ?
అని కదా ….
అర్ధం చేసుకోరూ ….
బయట ఒకటి చెప్పినా అదే బయట మరొకటి చేసి చూపినా
ఏది నిజమో ప్రజలకు చెప్పక చెప్పే చిరంజీవి
రాజకీయాలలో చిరంజీవి కాదా మరి
అర్ధం చేసుకోరూ !!

ఇదంతా చిరంజీవికి తెలియదనుకుంటున్నారా?
అంతా చట్ట ప్రకారం చేస్తాడు
చాలెంజ్ సిన్మా చూడలేదూ
నాకు తెలిసిపోయింది ఇప్పుడు
మీకెప్పటికీ అస్సలు అర్ధంకాదు అని
మళ్ళీ ఎన్నికలొస్తే మీరే ఓటు వేస్తారు
ఎవరికీ … మీరు మరీను… చిరంజీవికే.