ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు-04 “ఓదార్పు యాత్రలు”

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

చూడగా చూడగా, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఓదార్పు యాత్రలు చేపట్టాలని భావిస్తున్నట్లుంది కాంగ్రెస్.

తాను భారతీయుడినని చెప్పుకోటానికి కూడా సిగ్గు”పడుతూ లేస్తూ” నిన్న తెల్లవారుఝామునే యు.పి.లోని గ్రేటర్ నోయిడాలో భూసేకరణ బాధితులను పరామర్శించి ధర్నాలో పాల్గోటానికి వెళ్ళాడట యువరాజు!

పాపం యు.పి., బీహార్, గుజరాత్, కర్నాటక లాంటి కాంగ్రేసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అయ్యవారు భారతీయుడైనందుకు సిగ్గుపడుతున్నట్లున్నాడు. ఆంధ్ర, రాజస్థాన్, మహారాష్ట్రల్లో మాత్రం గర్విస్తున్నట్లున్నాడు.

ఈ యువరాజు డిగ్గీరాజాను (దిగ్విజయ్ సింగ్)ను రాజగురువుగా నియమించుకున్నట్లున్నాడు. మొన్ననే ఈ రాజగురువు,”ఒసామాజీ”కు సరైన అపరకర్మలు చేయలేదని కన్నీరుమున్నీరయ్యారు కూడా. బహుశా పాకిస్తాన్ కో, సౌదీ కో కూడా యువరాజులుంగారిని ఓదార్పు యాత్రలకు తీసుకెళ్తాడేమో ఈ రాజగురువు, భారతీయుడిగా సిగ్గుపడేలా చేస్తూ!

 

 

బాబూ… డిగ్గీరాజా టోపీలు బాగా పెడ్తాడుట… జర సంభాల్ కే చల్….

 

PS: ఓదార్పుయాత్రల కనిపెట్టుదారుడైన వై.ఎస్. జగన్ “ఓదార్పు” పై పేటెంట్ దాఖలు చేసే రోజు ఎంతో దూరం లేదని  అనిపించడంలో ఎలాంటి అసంబద్ధతా లేదని అనిపిస్తోంది!