ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు-15 “చితకబాదుడు రాజకీయాలు”

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈమధ్య (21 జులై 2011)టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ గారు ఆంధ్రా భవన్ లో ఓ అధికారిని (కె. చంద్ర రావు) చితకబాదారట! కారణం ఈయన చెప్పిన మాట ఆ అధికారి వినలేదట.

 


మొన్నెప్పుడో (8 ఏప్రిల్ 2011) ఆంధ్ర ప్రభుత్వంలో మంత్రి శంకర రావు గారు తన అసిస్టెంటు నెవరినో (అతని పేరు వెంకటేష్ ట) మీడియా ప్రతినిధుల ఎదురుగానే లెంపకాయ కొట్టారట. కారణం, మంత్రిగారు మీటింగులో ఉన్నప్పుడు మొబైల్ మోగితే ఆ మొబైల్ తీయలేదట!

 

అంతకు మునుపు ఎప్పుడో (1 జులై 2009) కాంగ్రెస్ ఎం.పి. మంధా జగన్నాధం సార్ ఎవరో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బాంక్ మేనేజర్ (రవీందర్ రెడ్డి) దళితులకు మాత్రమే ఋణాలు ఇవ్వటంలేదని కాలర్ పట్టుకొని మరీ చెంప ఛెళ్ళుమనిపించాడట.

 

వీళ్ళు చెప్పిన పనులు చేయలేదని అధికారులను చితకబాదేస్తున్నారు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. మరి ప్రజల కోసం పనిచేయనందుకు ప్రజలేం చేయాలో పశువునడిగినా చెబ్తుంది. కావాలంటే ఈ ఫొటో చూడండి.

 


అప్పుడప్పుడు బూట్ సత్కారాలతో సరిపెట్టేస్తే పనులయ్యేట్లు లేవు. ఏం చేయాలో మీరు ఓ కామెంటేసి చెప్పండి.