ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

యీయ్యాల్టి రామాయణం – మదువనం లో పార్టీ

Like-o-Meter
[Total: 0 Average: 0]

అప్పన్న: ఒరేయ్ రాజన్న మదువనంలో కోతులన్నీ పార్టీ సేసు కున్నాయి గదా అంటే ఇలా పార్టీలు సేసుకోవడం రాములోరి కాలం లోనే ఉందన్న మాట. మరి ఇఫతారు పార్టీ అని మన సి. ఎం బాబు ఇచ్చే పార్టీలు మన పెదాని ఇచ్చే పార్టీలు ఎం సాదించామని ఇత్తారు?  కోతులైతే సీతమ్మ జాడ కనుక్కోన్నై 


రాజన్న: పేజాసామ్మేం లో పార్టీలు ఏరు రామయనంలో పార్టీలు ఏరు

అప్పన్న: అంటే

రాజన్న: మన పార్లమెంటు కేంటీన్ లో  మన ఎంపీలకు బోయనం పెడతారు అంటే మన ఎంపీలు ఆళ్ళ బోయనం తెచ్చుకోలేరానా? కాదు కదా. అలాగే ఇందులు సాల ఇత్తారు అంటే ఆల్లు ఇందులు ఆరగిస్తే దేసంలో ఉన్నోల్లంతా అరగించినట్టే అని అద్దమనా ? కాదు కదా .


అప్పన్న: ఇది అన్నాయం

రాజన్న: కాదు ఇది మనం పెట్టుకున్న ఇసయం అని పేపర్లో సదువు తుంటే ఇన్నాను

అప్పన్న: అంటే ఇలాగే పార్టీలు సేసుకోవాలని మనం వోటేసామా?

రాజన్న: మనం ఒక్క వోట్ ఏస్తే ఆ వోటుతో ఎన్నో సట్టాలు తెత్తారు. మొన్నకి మొన్న మన ఎం ఎల్ ఏ లు ఆళ్ళ జీతం పెంచుకోలేదు ?

అప్పన్న: అంటే మనం వోటు ఏసే ముందు ఈళ్ళు ఇన్ని సట్టాలు తెత్తం అని సెబితే పోలా ఎలాటి సట్టం మనకుపయోగామో అలాటి సట్టం తెచ్చే వోల్లకే వోటు ఎయ్యవచ్చు గదా.

రాజన్న: నువ్వీమద్దేనే రామాయనం ఇన్టాన్నావు కాబట్టి అలాగే ఆ టీ కొట్టు శీను గాడు నీకు వార్తలు సదివి ఇనిపిత్తన్నాడు కాబట్టీ నీకు ఇన్ని తెలిసినై మరి నీ లాగ ఎంతమంది ఉన్నారు?

అప్పన్న: అదన్టావా!!

రాజన్న: మరదే.  రామాయనం ఇను కాని రాజకీయాలు దానికి మెలికేట్టకు. నీకు రెండూ అద్దం కావు.

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>