అప్పన్న : ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన పేరుమీద మరి పరిపాలన సేయ్యరే!
రాజన్న : నీ మొగం. పెమాన సీకారం నువ్వు సూడలేదా గవర్నరు గారు సెప్పింది సెప్పి దేవుడు మీద పెమానం సేసి కుర్సీలో కూసుంటారు. రావుడా
సోవుడా !!
అప్పన్న : మరి ఎందుకు అలా సెపుతారు?
రాజన్న : అంటే రావుడిలా పాలిత్తాను అని
అప్పన్న: ఎహే మళ్ళీ అదే మాట ఆడు రావుడు కాదు కదా
రాజన్న : ఎర్రి మొగమా నీకు ఇంకా తెల్దు. అవన్నీ రాజకీయాలు
అప్పన్న : ఏంటి రామరాజ్యం తెత్తం కూడా రాజకీయమేనా ?
రాజన్న : ఆ మాటకి వత్తే దర్మం, నాయం, సట్టం, పోలీసులు అన్నీ రాజకీయమే
అప్పన్న : ఏవో రా సెడ్డ తిరకాసుగా ఉంది. మొన్న రామాయనం ఆ సేగంటాయన సెప్పినపుడు బలే ఉందిరా. నేనైతే ఒక కలే కన్నాను ఏంటో తెలుసా ?
రాజన్న: కలే ఏంటది ?
అప్పన్న: మొన్న అ జగన్ బాబు వచ్చి నా బుగ్గలు నిమిరి ఒదార్సాడు సూడు అప్పుడు వచ్చిన్దీకల. అంతకు ముందురోజే ఆ సేగంటాయన బరతుడు ఎంతో బక్తి తో అయోద్యని రాముడి సెప్పులు సూత్తూ పాలిత్తాడు అని అలాగే నేను ఆ జగన్ బాబు సి ఎం అయితే ఆళ్ళ నాన్న సెప్పులు కుర్సీలో పెట్టి పూజ సేసి ఆటిని సూత్తూ పాలిత్తాడేమోనని అనుకున్నట్టూ, మాకోద్దంటే మాకొద్దు ఈ రాజ్యం అని రాములోరు ఆయన తమ్ముళ్ళు దెబ్బలాడుకున్నారట గదా. అలాగే వచ్చే ఎన్నికల్లో మాకోద్దంటే మాకొద్దు ఈ సిఎం పదవి అని రాములోరి సెప్పుల కోసం ఆ సిరంజీవి, కిరను, జగను, బొత్స దెబ్బలాడుకుంటారేమో అని నీకు సెప్పుతున్నట్టూ కలొచ్చింది . ఏమైనా కుర్సీలో రాములోరి సెప్పులు పెట్టి పరిపాలించడం బలే ఇసయం!
రాజన్న : కల కాదు ఇప్పుడు నిజంగానే నువ్వు నాకు సెప్పేసావు . వురై నీకు రామాయణం బాగా తలకెక్కింది అందుకే నీకీ పిచ్చి కలలు.
అప్పన్న: కాదురా బా జ పా గెలిత్తే అలా అయోధ్య నుంచి రాములోరి సెప్పులు కురిసీ లో పెట్టి పాలిత్తారేమో రా నాకు మా చెడ్డ ఉబలాటం గా ఉంది అలా సూడాలని
రాజన్న : మరి సోనియా గాంది వత్తే
అప్పన్న : సోనియా సెప్పులు కురిసీలో పెట్టి రాహులు బాబు పాలిత్తాడు.
రాజన్న : అంటే నీకు ఎవరో ఒకరు ఎవరో ఒకరి సెప్పులు కురిసీలో పెట్టి పాలించాలని ఉందన్న మాట. నీకు పిచ్చి బాగా ముదిరి పోయిందిరోయ్. పద నీ ఇంటిది పిలుత్తుంది కూడు తిండానికి. తిని తొంగో రేపు కలుద్దాం.