ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మతం, పెళ్ళి, సినిమా

Like-o-Meter
[Total: 0 Average: 0]

“నమస్కారం గురూ!”

“తస్కర శిష్యా! ఈ మస్కారమేలరా?”

“ఇలా తిట్టడం భావ్యమా గురూ?”

“వెర్రోహం! తిన్నదరగక్క వుత్తినే తిరిగే ఈలోకంలో తిట్లే దీవెనులురా!”

“ఆహా! దివ్యోపదేశం, దివ్యోపదేశం!”

“సరే, ఏదో సందేహాన్ని దేహంలో నింపుకొచ్చినట్టున్నావ్!”

“అవును గురూ! మీరు అజ్ఞానులకే అజ్ఞానులు గదా. తీర్చగలరని వచ్చాను.”

“ఊ…ఏమిరా నీ అహంకారము? నన్నే తిట్టెదవా?”

“తిన్నదరక్క వుత్తినే తిరిగే ఈలోకంలో……”

“ఓహో! గురువును ముంచిన శిష్యరికమా! మెచ్చినానురా, నచ్చినావురా! నీ అనుమానాన్ని అడిగేసి, కడిగేసుకో!”

“ధన్యోహం! నా అనుమానమంతా డయానా మరియం కురియన్ అనబడే Eye Star భామ గురించి గురూ!”

“వెర్రోహం! Eye Star అంటే నయన తార అనేగా నీ యిది?”

అహో! అద్భుతం. చెప్పండి గురూ! నయనతారా బేబీ ఏల ప్రభువును వదిలెను? ఏల హిందువుగా మారెను? ఆ వెంకన్నను దర్శించెను?”

“వెర్రిశిష్యవాడా! ఆ భామ వరించిన వాని పేరేమిరా?”

“ప్రభుదేవా గురూ”

“అదేకదరా నీ ప్రశ్నవెర్రికి విరుగడు!”

“అర్థం కాలేదు గురూ! విడమర్చి పుణ్యం కట్టుకోండి.”

“నీ ఐ స్టార్ బేబీ మొదట ప్రభువును నమ్ముకొనెను. అటుపై ఏడుకొండల దేవుడికి మొక్కెను. ఆమధ్యలో ప్రభుదేవుణ్ణి మెచ్చెను. ఇదియంతా ఆ ప్రభు దేవుని మహిమ.”

“ఓ…హో..మెన్!”

“ఔ…ఆమెన్”

* * * * *

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>